Telangana : మేము నామినేటెడ్ వ్యక్తులం కాదు..గవర్నర్ కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి : మంత్రి తలసాని

మేము నామినేటెడ్ వ్యక్తులం కాదు..గవర్నర్ కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.రాజ్యంగంలో ఎవరి విధులు ఏ విధంగా ఉండాలనేది తెలియజేశారని అన్నారు.

Telangana : మేము నామినేటెడ్ వ్యక్తులం కాదు..గవర్నర్ కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి : మంత్రి తలసాని

Talasani Srinivas Yadav Strong Response On Governor Tamilisai Comments

Telangana : తెలంగాణలో గత కొంతకాలంగా రాజ్‌భవన్‌ వర్సెస్ TRS ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించటం..గవర్నర్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు టీఆర్ఎస్ నేతలు వెళ్లకపోవటం వంటి ఎన్నో విషయాలు కూల్ వార్ గా నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లుగా సాగుతున్న ఎపిసోడ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయటం కష్టం అని..తాను ప్రభుత్వం (టీఆర్ఎస్)ఎలా చెబితే అలా చేస్తూ ‘రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదు’అంటూ వ్యాఖ్యానించటం వంటివి అటు రాజ్ భవన్ కు ఇటు ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ మరికాస్త పెంచాయి.

ఈ క్రమంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రి తలసాని కాస్త తీవ్రంగానే స్పందిస్తూ..‘తెలంగాణ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదు అని గవర్నర్ చెప్పటం సరికాదన్నారు. బుధవారం (ఏప్రిల్ 20,2022) మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించటం సరికాదని అన్నారు.

Also read : Governor Tamilisai : సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టం : గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు

గవర్నర్‌తో ప్రభుత్వానికి కంటిన్యూస్‌గా పని ఉండదని.. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదు గవర్నర్ మాట్లాడటం సరికాదని అన్నారు. రాజ్యంగంలో ఎవరి విధులు ఏ విధంగా ఉండాలనేది స్పష్టంగా తెలియజేశారని.. ఆ విషయాన్ని విస్మరించి ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ఒక మహిళగా ఎంత గౌరవం ఇవ్వాలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చారని..గవర్నర్ రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శిచిన తలసాని.. అది కరెక్ట్ కాదని అన్నారు. . మాది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం .. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

‘‘దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ పాత్ర తక్కువ ఉంటుందని.. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి’’ అని తలసాని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని..ఈ విషయాన్ని గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏమిటని మంత్రి తలసాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని పాట లేదని మండిపడ్డారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం తప్ప వేరే లేదని అన్నారు.

Also read : Telangana Governor : గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు.. అనవసరంగా విమర్శిస్తున్నారు

కాగా..గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కలిసి పని చేయడం కష్టమని అన్నారు. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని తెలిపారు. రెండూ రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవని అ‍న్నారు. ఇప్పుడు తాను వారితో కలిసి పని చేశానని ఇక ఇతర ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలనని తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

సీఎం చెప్పార‌ని ఫైల్‌పై సంత‌కం చేయ‌డానికి తాను ర‌బ్బ‌ర్ స్టాంప్ గ‌వ‌ర్న‌ర్‌ను కదని అన్నారు. రాజ‌కీయంలో ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేస్తారని.. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌ప్పుడు తనపై విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ గా ఎవరున్నా కూడా ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.రాజ్ భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదన్నారు. ఏ విబేధాలున్నా చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై చెప్పారు. సీఎం, గ‌వ‌ర్న‌ర్ క‌లిసి ప‌నిచేయ‌క‌పోతే ఎలా ఉంటుందో తెలంగాణ‌ను చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Also read :  renuka chowdhury: మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు: రేణుకా చౌదరి