Movie Theatres : ‘వకీల్ సాబ్’ మినహా మిగతా థియేటర్లన్నీ మూసివేత..

కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఇప్పుడు థియేటర్లు మూతపడబోతున్నాయి..

Movie Theatres : ‘వకీల్ సాబ్’ మినహా మిగతా థియేటర్లన్నీ మూసివేత..

Movie Theatres

Movie Theatres: కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఇప్పుడు థియేటర్లు మూతపడబోతున్నాయి..

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్‌లో రోజుకి రెండు షోలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. కానీ రోజుకి నాలుగు షోలకు బదులు కనీసం మూడు షోలైనా వేయాలని థియేటర్స్ నిర్వాహకులు చర్చించుకున్నారు. కానీ ఇంతలోనే వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు..

‘వకీల్ సాబ్’ ప్రదర్శిస్తున్న థియేటర్లు మినహా మిగతా థియేటర్లను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.. కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అందరితో చర్చించి స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.