Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలం ప్రారంభానికి ముహూర్తం ఖరారు .. ప్రారంభించిన వెంటనే విధులు నిర్వహించనున్న సీఎం కేసీఆర్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలం ప్రారంభానికి ముహూర్తం ఖరారు .. ప్రారంభించిన వెంటనే విధులు నిర్వహించనున్న సీఎం కేసీఆర్

Telangana Secretariat Opening date Fix..

Telangana New Secretariat : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్య కలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు పనులు పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ అధికారులతో పాటు నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందుగా సీఎం బ్లాకులోని 6వ అంతస్తును ప్రారంభించి తన చాంబర్‌లో కేసీఆర్ విధులను నిర్వహిస్తారు.

సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచి పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని ఆదేశించారు. కొత్త పరిపాలన సౌధం రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా మారనుంది. సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుంటోంది. తెలంగాణకు మకుటాయమానంగా నిలిచేలా రూపొందుతోంది. అద్భుత నిర్మాణ శైలితో త్వరలోనే అందుబాటులోకి రానుంది.

శ్లాబుల నిర్మాణం, భవనం పైన డోమ్‌ల ఏర్పాటు, ఇంటీరియర్‌ పనులతో పాటు ఫర్నిచర్‌ విషయంలో కొత్త నమూనాలను ఎంపిక చేశారు. సచివాలయ భవన సముదాయం ముందు భాగంలో ల్యాండ్‌ స్కేపింగ్‌, గ్రీనరీ పనులను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో అద్భుత వాస్తుశైలితో నిర్మాణం జరుగుతున్న ఈ సౌధం తెలంగాణకు మకుటాయమానంగా నిలువనుంది.