TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు? | demand for kotha gudem seat in upcoming elections

TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అందులో తొమ్మిదింటిపై రాజకీయ పార్టీలకు ఓ క్లారిటీ ఉంది. మిగిలిన ఆ ఒక్కటే.. జిల్లాలో హాట్ సీట్‌గా మారింది. అదే.. కొత్తగూడెం. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకత్వానికి.. ఇదొక్కటే కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు.. మామూలు పోటీ లేదు. టీఆర్ఎస్ నుంచి ఓ ముగ్గురు.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు.. ఈ సీటు మీదే ఆశలు పెట్టుకున్నారు. దీని వెనకున్న రీజన్ చాలా చిన్నదే అయినా.. అది పెద్ద పొలిటికల్ వార్‌కే దారితీసింది.

TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?

TS Politics : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అందులో తొమ్మిదింటిపై రాజకీయ పార్టీలకు ఓ క్లారిటీ ఉంది. మిగిలిన ఆ ఒక్కటే.. జిల్లాలో హాట్ సీట్‌గా మారింది. అదే.. కొత్తగూడెం. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకత్వానికి.. ఇదొక్కటే కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు.. మామూలు పోటీ లేదు. టీఆర్ఎస్ నుంచి ఓ ముగ్గురు.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు.. ఈ సీటు మీదే ఆశలు పెట్టుకున్నారు. దీని వెనకున్న రీజన్ చాలా చిన్నదే అయినా.. అది పెద్ద పొలిటికల్ వార్‌కే దారితీసింది.

కొత్తగూడెం సీటుకు ఈ రేంజ్‌లో ఎందుకు డిమాండ్ పెరిగిందో తెలియాలంటే.. ఓ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో.. ఏడు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు. అంటే.. మిగిలిన 3 మాత్రమే జనరల్ సీట్లు. అవే.. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం. మరి.. కొత్తగూడెం మాత్రమే హాట్ సీట్ ఎందుకైందని.. ఇప్పటికే మీకో సందేహం వచ్చి ఉండాలి. దానికీ.. రకరకాల రాజకీయ కారణాలున్నాయ్. పాలేరు నుంచి.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పెద్దగా పోటీ లేదు. ఈ ప్రాంతంలో.. కాంగ్రెస్‌కు కూడా చెప్పుకోదగ్గ పట్టేమీ లేదు. ఖమ్మం విషయానికొస్తే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. సో.. మిగతా లీడర్లకు టికెట్ మీద ఆశల్లేవ్. ఖమ్మంలో.. కాంగ్రెస్ కూడా కాస్త వీక్‌గానే కనిపిస్తోంది. అందుకే.. ఆ పార్టీలోనూ పెద్దగా యుద్ధాలేమీ జరగట్లేదు. ఇక.. మిగిలిందల్లా కొత్తగూడెం ఒక్కటే.

Also read : Pawan Kalyan Janasena : ఏపీలో ఎన్నికల హీట్..‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన ‘మెగాసేన’

కొత్తగూడెం సీటు మీదే అంతా ఆశలు పెట్టుకోవడానికి.. చాలా కారణాలున్నాయ్. ఇక్కడ.. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబంపై.. రకరకాల ఆరోపణలున్నాయ్. దీంతో.. అధికార పార్టీ వనమా ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే చాన్స్ లేదనే ప్రచారం మొదలైంది. ఇదే అదనుగా భావించి.. ఎప్పటి నుంచో అసెంబ్లీ బరిలోకి దిగాలని చూస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి.. కొత్తగూడెంపై ఫోకస్ పెట్టారు. ఈయనతో పాటు ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కూడా.. ఈ సీటు మీదే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు.. వనమా కుటుంబం సైతం.. ఈసారి టీఆర్ఎస్ టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటోంది. దీంతో.. కొత్తగూడెం టీఆర్ఎస్‌లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కానీ.. హైకమాండ్ ఎవరివైపు మొగ్గుతుందన్నదే.. ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇక.. కాంగ్రెస్ విషయానికొస్తే.. కొత్తగూడెంలో ఈ మధ్య హస్తం పార్టీ నాయకులు బాగా యాక్టివ్ అయ్యారు. కానీ.. ఇక్కడి గ్రూపు తగాదాలతో.. టికెట్ ఎవరికి దక్కుతుందన్న దానిపై.. క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఇక్కడ భట్టి వర్గం వర్సెస్.. రేణుకా చౌదరి గ్రూప్ అన్నట్లుగా ఉన్నాయ్ పరిస్థితులు. లోకల్ కాంగ్రెస్‌లో.. ఎడవల్లి కృష్ణ కాస్త స్ట్రాంగ్ లీడర్. ఇతను.. రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. రేణుకా చౌదరి.. ఇన్ డైరెక్ట్‌గా రేవంత్‌కు మద్దతిస్తున్నారని.. పార్టీలో అందరికీ తెలుసు. ఇదిలా ఉండగానే.. ఈ మధ్యే కొత్తగూడెంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు. ఈయన.. భట్టి వర్గం అని మరో టాక్. దీంతో.. కొత్తగూడెం కాంగ్రెస్‌లో.. ఇప్పటి నుంచే టికెట్ పంచాయితీ మొదలైంది.

Also read : Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్‌

తీవ్ర పోటీ నెలకొన్న కొత్తగూడెం అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతాయ్? ఎవరికి టికెట్ ఇచ్చి.. ఎవరిని బుజ్జగిస్తారు? కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఎవరికి టికెట్ ఇచ్చినా.. మిగిలిన వాళ్లు.. ఇతర పార్టీల నుంచి గానీ.. ఇండిపెండెంట్లుగా గానీ పోటీ చేసే చాన్స్ లేకపోలేదని.. మరో చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో.. కొత్తగూడెం సీటుకు నెలకొన్న పోటీని.. పార్టీలు ఎలా డీల్ చేస్తాయన్నదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

×