Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా

తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి భారీగా తగ్గింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి.

Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి భారీగా తగ్గింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 18వేల 881 కరోనా పరీక్షలు నిర్వహించగా, 151 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు నమోదవడం ఊరటనిచ్చే అంశం.

24 గంటల వ్యవధిలో మరో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,775 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,81,427 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3వేల 237 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

అటు.. దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు కోవిడ్ మరణాలు కూడా 250లోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10,22,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,273 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగి వచ్చింది.

Covid 4th Wave : బాంబు పేల్చిన సైంటిస్టులు.. కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ !

నిన్న మరో 243 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,13,724కు చేరింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 20,439 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 4.22 కోట్లు దాటింది. ఆ రేటు 98.54%కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,472కు తగ్గి.. ఆ రేటు 0.26 శాతానికి క్షీణించింది. ఇక నిన్న 24,05,049 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసులు సంఖ్య 177 కోట్లు దాటింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యే లోపే మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు చెప్పిన విషయాలు కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని వారు తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.