Telangana Covid Report : తెలంగాణలో కొత్తగా 67 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..(Telangana Covid Report)

Telangana Covid Report : తెలంగాణలో కొత్తగా 67 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Covid Report : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 21వేల 843 కరోనా పరీక్షలు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో 19 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో మరో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో మరణాలేవీ సంభవించ లేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,418 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,85,442 మంది కోలుకున్నారు. ఇంకా 865 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.(Telangana Covid Report)

ఏపీలోనూ కరోనా వ్యాప్తి క్షీణదశకు చేరుకున్నట్టే భావించాలి. తాజా రోజువారీ గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 508 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

అదే సమయంలో మరో 85 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్కరోజులో కరోనా మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18, 884 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,03,607 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 730గా ఉంది. నేటివరకు రాష్ట్రంలో 3,32,67,581 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 57 కరోనా కేసులు వచ్చాయి.

అటు దేశవ్యాప్తంగానూ కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. దేశంలో ఈ రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా కొత్త కేసులు, మరణాల్లో గణనీయ తగ్గుదల నమోదైంది. వైరస్ వ్యాప్తి 2020 మే ప్రారంభం నాటి స్థాయికి తగ్గిపోయింది. ఇది భారీ ఊరటనిచ్చే అంశం. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కేవలం 2వేల 503 కోవిడ్ కేసులు, 27 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం 5,32,332 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు సంఖ్య తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం ఒక శాతం దిగువనే ఉంది.

ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. 4.24 కోట్ల మంది వైరస్‌ ను జయించారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. నేటివరకు దేశవ్యాప్తంగా 5.15 లక్షల మందికి పైగా కోవిడ్ తో మరణించారు. ఇటీవల కాలంలో రోజూవారీ మరణాలు 100 దిగువన నమోదవుతున్నాయి. ముందురోజు ఆ సంఖ్య 47గా ఉండగా.. తాజాగా 27కి చేరింది. ఇక కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 36వేల 168గా ఉంది. దాంతో యాక్టివ్‌ కేసుల రేటు 0.08 శాతానికి క్షీణించింది. కరోనా కట్టడికి కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

India Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు..

మరోవైపు మార్చి16 నుండి 12-15 ఏళ్ల పిల్లలకూ కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకాలు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవియా వెల్లడించారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌నీ విష‌యాన్ని తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఈ టీకాలు ఇవ్వ‌నున్నారు. పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ముందు జాగ్రత్త డోసు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సూచించారు.