Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 20వేల 617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 773గా ఉంది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..

COVID19 cases in India

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39వేల 320 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 771 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 289 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 53 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 కేసులు, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు, నల్గొండ జిల్లాలో 28 కేసులు గుర్తించారు.

Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 581 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 20వేల 617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 773గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 32వేల 834 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 705 మందికి పాజిటివ్ గా తేలింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.