Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. కొత్తగా ఎన్ని కేసులు అంటే..

COVID19 cases in India

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38వేల 024 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 851 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 327 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 65 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 37 కేసులు, సిద్ధిపేట జిల్లాలో 32 కేసులు, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు గుర్తించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 652 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 19వేల 141 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 09వేల 661 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 369కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 40వేల 593 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 923 మందికి పాజిటివ్ గా తేలింది.

Ban On Lockdown : లాక్‌డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.