Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 62 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

Telangana Covid Report

Telangana Covid Report Update : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12వేల 435 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 62 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇంకా 374 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7,92,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,88,142 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 9వేల 019 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 28 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Report Update)

Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఆదివారం 2.97 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,202 మందికి పాజిటివ్‌గా తేలింది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 3 వేలకు దిగువన నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 2వేల 550 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మహమ్మారి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 17,317(0.04శాతం)కు తగ్గిపోయాయి.

ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకింది. అందులో 4.25 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న మరో 27 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5.24 లక్షలు దాటింది. మొత్తంగా 191 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. పలు దేశాల్లో బూస్టర్‌ డోసుల పంపిణీ కూడా జరుగుతోంది. మన దేశంలో థర్డ్ వేవ్ పెద్దగా లేదు. అయినా సరే, కరోనా తీవ్ర దశ ముగిసిందని చెప్పలేమంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘కొన్ని దేశాలు మహమ్మారి అత్యవసర దశను ముగించగలిగి ఉండొచ్చు. కానీ, అన్ని దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై మన పోరాటం కొనసాగించాలి’ అని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది.

Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..

అలాగే 50కి పైగా దేశాల్లో కేసులు పెరుగుతోన్న విషయాన్ని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. వాక్సినేషన్ మెరుగ్గా జరిగిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది. వ్యాక్సినేషన్ స్థాయులు తక్కువగా ఉన్న దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పేద దేశాల్లో 16 శాతం మంది అర్హులకే టీకా అందిందని తెలిపింది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాలో గత మూడు వారాల్లో కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగాయని, మరణాలు రెట్టింపయ్యాయని ఆరోగ్య సంస్థ ఆఫ్రికా విభాగం వెల్లడించింది. అయితే గత వేవ్‌తో పోల్చుకుంటే ఆసుపత్రిలో చేరికలు 20 శాతమేనంది. ప్రస్తుతం బీఏ.4, బీఏ.5 (ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు) ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. వాటిలో చోటుచేసుకున్న ఉత్పరివర్తనలే అందుకు కారణమని చెప్పింది.