TSRTC bus fired: ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు..

తెలంగాణాలోని ములుగు జిల్లాలో దుండగులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిలిపిఉన్న బస్సుకు దండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

TSRTC bus fired: ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు..

TSRTC bus fired: ఎవరికి కోపం వచ్చినా..ఆందోళన చేపట్టినా పాపం ఆర్టీసీ బస్సే బలి అయపోతుంది. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టామనుకుంటారు. కానీ అది మనకే నష్టమని మాత్రం గుర్తించరు. ఆందోళన చేపడితే చాలు నిరసన కారులు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేయటం..నిప్పు పెట్టటం చేస్తుంటారు. ఈక్రమంలో మరో ఆర్టీసీ బస్సు కొంతమంది దుండగుల దుందుడుకుతనానికి ఆహుతి అయిపోయింది. మంటల్లో కాలిపోయింది.

Read more : Omicron : తెలంగాణలో ఒమిక్రాన్..హైదరాబాద్‌‌లో రెండు కేసులు

తెలంగాణాలోని ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉన్న బస్సుకు దండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్‌ స్టేషన్‌లో నైట్‌ హాల్ట్‌గా ఉన్న ములుగు డిపో బస్సు తిరిగి తెల్లవారుజామున బయల్దేరనుంది. ఈ క్రమంలో బస్ స్టేషన్ లో నిలిపి ఉన్న బస్సుకు అర్థరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనక భాగంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బస్సు పాక్షికంగా కాలిపోయింది.

Read more : AP govt on ticket rates: హైకోర్టు తీర్పుపై.. అప్పీల్‌కు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం

బస్సు వెనుక భాగంలోని ఒక చక్రంతో పాటు బస్సులోని వెనుక భాగంలోనీ సీట్లు కాలిపోయాయి. బస్సు మంటలు రావటంతో డ్రైవర్, కండక్టర్ గుర్తించి వెంటనే అప్రమత్తమైన స్థానికుల సహాయంతో మంటలు ఆర్పారు. దీంతో బస్సు పూర్తిగా కాలిపోకుండానే చేయగలిగారు. కాగా ములుగు జిల్లాలోని ఆ ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులు ఈ పనికి పాల్పడ్డారా? లేక ఆకతాయిల పనా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.