TSRTC : ప్రయాణీకులకు మరో షాక్..రిజర్వేషన్ చార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ..

ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరోషాక్ ఇచ్చింది.రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది.రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. దీంతోప్రయాణీకులకు అదనపు భారం పడింది

TSRTC : ప్రయాణీకులకు మరో షాక్..రిజర్వేషన్ చార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ..

Telangana Rtc Raises Reservation Charges (1)

TSRTC: ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. దీంతో ప్రయాణీకులకు అదనపు భారం పడింది. ఒక్కో రిజర్వేషన్ పై రూ.20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా పెంచింది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పెంచిన చార్జీలతో సతమతమవుతుంటే ఇప్పుడు రిజర్వేషన్ చార్జీలు కూడా పెంచటం ఇంకాస్త భారమైంది అని వాపోతున్నారు.

కాగా… గత నెలలో టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. తాజాగా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచి మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసి ఇప్పటి వరకు పెరుగుదలపై అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా కొన్ని వారాల క్రితం టికెట్ల ధరలు స్వల్పంగా పెంచిన తెలంగాణ పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే టోల్ ప్లాజా ధరలు కూడా టికెట్ పై రూపాయి చొప్పున పెంచారు. లగ్జరీ, ఎక్స్ ప్రెస్ బస్సులపై ఒక రూపాయి, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులపై 2 రూపాయల చొప్పున పెంచిన విషయం తెలిసిందే.