Buddhavanam: ‘బుద్ధవనం’ రేపే ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’ శనివారం ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, టూరిజం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రారంభమవుతుంది.

Buddhavanam: ‘బుద్ధవనం’ రేపే ప్రారంభం

Buddhavanam

Buddhavanam: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’ శనివారం ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, టూరిజం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రారంభమవుతుంది. ఇది బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందిన థీమ్ పార్క్. కృష్ణా నది ఒడ్డున, నాగార్జన సాగర్ వద్ద దీన్ని నిర్మించారు. శనివారం బుద్ధవనాన్ని కేటీఆర్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు వంద కోట్ల రూపాయలతో నిర్మించిన బుద్దవనం ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుంది.

Telangana : ‘బారిష్ పూజ’ చేస్తే డబ్బులు పెరుగుతాయి అంటూ బురిడీ.. రూ.12లక్షలతో ఉడాయించిన దొంగ బాబా

బౌద్ధ మతానికి సంబంధించిన, మూడో శతాబ్దం నాటి అనేక అంశాలు గుర్తొచ్చేలా దీన్ని రూపొందించారు. దేశీయ పర్యాటకులతోపాటు, విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా టూరిస్టులు ఎక్కువగా వస్తారని ఆశిస్తున్నారు. బుద్ధవనాన్ని ఎనిమిది సెగ్మెంట్లుగా విభజించారు. బుద్ధచరిత వనం, జటాకావనం (బోధిసత్వ పార్క్), ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూప, బౌద్ధ విద్యా కేంద్రం, ఆతిథ్య కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలుగా దీన్ని విభజించారు. వీటిలో సిద్ధార్థ గౌతముడికి సంబంధించిన జీవిత విశేషాలు తెలిపే కథలు, కళాకృతులు, స్థూపాలు వంటివి ఉంటాయి.