Movies Postponed : రెడీ ఫర్ రిలీజ్.. ఫస్ట్ కాపీ పట్టుకుని వెయిట్ చేస్తున్న మేకర్స్..

ఎక్కడా కరోనా మళ్లీ అడ్డం పడిపోతుందో అని అనౌన్స్ చేసిన సినిమాల షూటింగ్ చకచకా చేసేసుకుంటున్నారు హీరోలు. అయితే ఆపసోపాలు పడి ఆఘమేఘాల మీద సినిమా కంప్లీట్ చేసుకుంటే.. తీరా ఈ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి థియేటర్లు కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక తెరమీద మా బొమ్మ పడేదెప్పుడో అని వెయిట్ చేస్తున్న సినిమాలేంటో చూద్దాం..

Movies Postponed : రెడీ ఫర్ రిలీజ్.. ఫస్ట్ కాపీ పట్టుకుని వెయిట్ చేస్తున్న మేకర్స్..

Movies Postponed

Movies Postponed: ఎక్కడా కరోనా మళ్లీ అడ్డం పడిపోతుందో అని అనౌన్స్ చేసిన సినిమాల షూటింగ్ చకచకా చేసేసుకుంటున్నారు హీరోలు. అయితే ఆపసోపాలు పడి ఆఘమేఘాల మీద సినిమా కంప్లీట్ చేసుకుంటే.. తీరా ఈ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి థియేటర్లు కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక తెరమీద మా బొమ్మ పడేదెప్పుడో అని వెయిట్ చేస్తున్న సినిమాలేంటో చూద్దాం.

లాస్ట్ ఇయర్ లైనప్ చేసుకున్న సినిమాల షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా చేసేస్తున్నారు అందరూ. మళ్లీ ఎక్కడ కరోనా వచ్చి అన్నిటికీ బ్రేక్ వేస్తుందో అని చకచకా పని కానిచ్చేస్తున్నారు హీరోలు. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన ‘నారప్ప’ ఇంకా రిలీజ్ కాకుండానే మొన్నీ మధ్యనే ‘దృశ్యం 2’ మొదలుపెట్టారు. అంతలోనే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు రిలీజ్ చేసే పరిస్థితులు లేవు కాబట్టి.. సినిమా కాపీని దగ్గర పెట్టుకుని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ‘దృశ్యం 2’ యూనిట్..

NARAPPA

ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన నాగ చైతన్య, సాయిపల్లవి లీడ్ రోల్స్‌లో నటించిన బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ మూవీని రిలీజ్ చెయ్యడం లేదని అనౌన్స్ చేసింది టీమ్. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ చెప్పారు.. అంతేకాదు పరిస్థితులు చక్కబడ్డాకే సినిమా రిలీజ్ ఉంటుందంటూ డేట్ కూడా చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్.

Love Story

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల డైరెక్షన్లో తెరకెక్కిన ‘విరాట పర్వం’ సినిమా కూడా ఆడియెన్స్ ముందుకు ఎప్పుడు రావాలా అని ఎదురు చూస్తోంది. ఈ నెలలోనే రిలీజ్ కావల్సిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ కోవిడ్ దెబ్బకి రిలీజ్ క్యాన్సిల్ చేసుకుని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది.

Virata Parvam

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని కూడా తన సినిమా వాయిదా వేసుకున్నారు. నాని, రీతూ వర్మ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’.. ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వద్దామా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. అయితే రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమా ఇప్పుడు కోవిడ్‌తో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ రిలీజ్ అయ్యే టైమ్ ఎప్పుడా అని రోజులు లెక్కబెట్టుకుంటున్నారు టీమ్.

Tuck Jagadish

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా సినిమా కంప్లీట్ చేసకుని రిలీజ్ అయ్యే టైమ్ ఎప్పుడా అని ఎదురుచూస్తోంది. గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘సీటీ మార్’ కూడా మొత్తం ప్రింట్ రెడీ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

Varudu Kavalenu

కంగనా లీడ్ రోల్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘తలైవి’ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని భారీగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా థియేటర్లోకి వచ్చేది ఎప్పుడా అని ఎదురు చూస్తోంది.

Thalaivi

లేటెస్ట్‌గా థియేటర్లు కూడా బంద్ అవ్వడంతో ‘ఇష్క్’, ‘ఏక్ మినీ ప్రేమకథ’ సినిమాలు కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. తేజ్ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘ఇష్క్’ ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిఉంది. అలాగే సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న ‘ఏక్ మినీ ప్రేమకథ’ కూడా ఈ నెలాఖరుకు రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. కానీ థియేటర్లు లేకపోవడంతో రిలీజ్ కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది..

Ishq