60 Years : తెలుగు సంవత్సరాలు 60..షష్టిపూర్తి 60ఏళ్ళకే.. అలా ఎందుకంటే?..

మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది.

10TV Telugu News

60 Years : తెలుగు సంవత్సరాలు 60..ఈ విషయం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. సంవత్సరం మారినప్పుడల్లా కొత్త తెలుగు సంవత్సరం పేరును పండితులు పంచాంగం చెప్పే సమయంలో వినటం, క్యాలెండర్లలో చూడటం ద్వారా తెలుసుకుంటాం… కాని తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండటానికి వెనుక దాగి ఉన్న అసలు కధ మాత్రం చాలా మందికి తెలియదు. ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకు ఉండటానికి గలకారణాలేంటి..ఆపేర్లను ఎవరు పెట్టారు… కేవలం అరవై మాత్రమే ఎందుకున్నాయనే దానికి ఓ పురాణగాధ ఉంది.

అసలు కధ ఇదే…
నారద మునీంద్రుడు తనంత గొప్పవాడులేడని విర్రవీగుతున్న సమయంలో అతనికి జ్జానబోధ చేయాలని శ్రీ మహావిష్ణువు నిర్ణయానికి వచ్చాడు. దీంతో నారదుడిని మాయ ఆవరింపచేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి స్త్రీ రూపంలోకి మారిపోయాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. ఆసంతానానికి పెట్టిన పేర్లే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు నారదుడు..నారదుడిని ఆవరించిన మాయను తొలగించి, మహావిష్ణువు జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

60 ఏళ్ళకే షష్టిపూర్తి ఎందుకంటే..
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది.

ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. మానవుడి ఆలోచనా శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్నిపూర్తి చేసుకున్న వారికి బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి షష్టిపూర్తి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

 

10TV Telugu News