Madras High Court : రోడ్లను ఆక్రమించి ఆలయాలు నిర్మించడం సరికాదు

ప్రభుత్వ స్థలం ఆక్రమించి...గుడినిర్మించి....ఇప్పుడు మతవిశ్వాసాలు అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి నష్టం కలిగించాలనుకుంటున్నవ్యక్తి తీరును తప్పుపడుతూ...

Madras High Court : రోడ్లను ఆక్రమించి ఆలయాలు నిర్మించడం సరికాదు

Madras High Court

God Is Omnipresent : ఇంట్లో ఓ స్థలం కేటాయించి…ఆ స్థలంలోనే దేవుడి ఫొటోలు ఉంచి పూజలు జరుపుతుంటాం. అలాగే బయట దేవుని కోసం ఆలయాలు నిర్మిస్తుంటారు. భగవంతుడు అన్ని చోట్లా ఉంటాడని ఎందరు చెబుతున్నా సాధారణ ప్రజలు మాత్రం ఆలయాల్లోనే ఆయన్ను దర్శిస్తారు. పూజలు చేస్తారు. గుడి అంటేనే పరమ పవిత్రంగా భావిస్తారు. సామాన్య భక్తులతో తోటివారికొచ్చే ఇబ్బందీ ఏమీలేదు. కానీ దేవుని ముసుగులో ఆక్రమణలు చాలానే జరిగాయి. కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడిన దేవుడు, ఆలయం వంటి అంశాలు అడ్డుపెట్టుకుని కొందరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. మరికొందరు సొంత ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఆలయం పేరుతో ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఒక్కసారి దేవుడి పేరు చెబితే ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపైనే మద్రాస్ హైకోర్ట్ మండిపడింది. భగవంతుడి పేరు చెప్పుకుని…ప్రభుత్వ స్థలం ఆక్రమించి…గుడినిర్మించి….ఇప్పుడు మతవిశ్వాసాలు అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి నష్టం కలిగించాలనుకుంటున్నవ్యక్తి తీరును తప్పుపడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ వైద్యనాథన్, డి.భారత చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More : Shruti Haasan-Tamannaah: సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్లు

దేవుడికి ప్రత్యేక స్థలం అవసరం లేదు :-
ఆలయం…భూమిని ఆక్రమించుకోలేదు. దేవుడు సర్వాంతర్యామి. తన ఉనికిని చాటడానికి దేవుడికి ప్రత్యేక స్థలం అవసరం లేదు. మతం పేరుతో ప్రజలను విడదీయడం అత్యంత ప్రమాదకరం అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఓ వినాయక గుడిని కూల్చివేయాల్సిందిగా వచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ఆలయం పేరుతో రహదారి స్థలాన్ని ఆక్రమించుకోవడం సరైనది కాదని, మతం, కులం వంటివన్నీ ప్రజా ప్రయోజనాల తర్వాతేనని స్పష్టంచేశారు. ఆలయాన్ని…భక్తులకు అందుబాటులో ఉంచడమే పిటిషనర్ లక్ష్యమయితే….ఆయనకు చెందిన ఇతర స్థలంలో లేదా…స్వచ్చందంగా ముందుకువచ్చిన వారి స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని సూచించారు.

Read More : Schools Reopen : ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు పున: ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అసలేం జరిగింది ? 
తమిళనాడు పెరంబలూర్ జిల్లాలోని వెప్పనథట్టిలో ఉన్న ఆలయాన్ని కూల్చివేయాల్సిందిగా రాష్ట్ర రహదారుల విభాగం ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆలయ ట్రస్టీ అయిన ఎస్. పెరియస్వామి హైకోర్టును ఆశ్రయించారు. మూడు దశాబ్దాలుగా ఆలయం ఇక్కడే ఉందని, దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదని తన పిటిషన్‌లో తెలిపారు. పిటిషనర్ చెప్పిందే నిజమైతే ఆ స్థలం ఆలయానిదే అని తెలియజేసే పత్రాలు ఎందుకు సమర్పించలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. పెరియస్వామి కోరినట్టుగా ప్రభుత్వ ఆదేశాలపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఎవరి నుంచీ అభ్యంతరాలు లేవన్న ఒక్కకారణంతో…ఈ ఆక్రమణను చట్టబద్ధం చేయలేమన్నారు. ప్రభుత్వ ఆదేశాలపై స్టే ఇస్తే…ఇక నుంచి ఆక్రమణలకు పాల్పడేవారంతా…మిగిలిన ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి..తప్పించుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.