Ujjaini bonalu 2022: ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద కొద్దిసేపు ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Ujjaini bonalu 2022: ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత

New Project

Ujjaini bonalu 2022: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద కొద్దిసేపు ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ ఠాకూర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Ujjaini bonalu 2022: అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పించిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి.. ఏర్పాట్ల‌పై ఏమ‌న్నారంటే..

దీంతో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కసారిగా బారికేడ్లను తొసుకొని రేవంత్, కాంగ్రెస్ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆలయమా? టీఆర్ఎస్ ఆఫీసా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు గంటల తరబడి నిలబెడుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే మీడియా ప్రతినిధులపైనా పోలీసులు జులం ప్రదర్శించారు. పలు మీడియా కెమెరా మెన్ లపై పోలీసులు చేయి చేసుకోవటంతో పోలీసులు, మీడియా ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Kavitha

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులుు కవితను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. క‌విత వెంట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుటుంబ స‌భ్యులు, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు.