Hyderabad: నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత… హాస్టల్ సీట్ల కేటాయింపుపై కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్, నిజాం కాలేజీ వద్ద డిగ్రీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్ సీట్లు పూర్తిగా తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Hyderabad: నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత… హాస్టల్ సీట్ల కేటాయింపుపై కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

Hyderabad: హైదరాబాద్ నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హాస్టల్ బిల్డింగ్ తమకు మాత్రమే కేటాయించాలని కోరుతూ డిగ్రీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: నేడు విశాఖలో ప్రధానితో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాలపై చర్చ.. సాయంత్రం విశాఖకు పవన్

సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన విద్యా శాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం విద్యార్థులతో అధికారులు చర్చలు జరిపారు. హాస్టల్‌లో సీట్లు పీజీ విద్యార్థులకు 50 శాతం, డిగ్రీ విద్యార్థులకు 50 శాతం కేటాయిస్తామని అధికారులు చెప్పారు. దీనిపై డిగ్రీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హాస్టల్ పూర్తిగా డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని విద్యార్థులు పట్టుబట్టారు. దీంతో అధికారులు, విద్యార్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అధికారులపై విద్యార్థులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఆందోళన విరమించకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Metas Layoff: తెల్లారేలోపే ఉద్యోగాలు తీసేసిన ‘మెటా’.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

చర్చలకు పిలిచి బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదువుకోవాలా.. చదువు మానేసి వెళ్లిపోవాలా అంటూ స్టూడెంట్స్ నినాదాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలు కూడా అమలు చేయడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఇటు విద్యార్థుల ఆందోళన, అటు పోలీసుల మోహరింపుతో నిజాం కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.