Telangana : బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నం..ఉద్రిక్తత

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Telangana : బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నం..ఉద్రిక్తత

Tension In Bandi Sanjay Padayatra

tension in Bandi Sanjay padayatra at jogulamba district : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్యాతీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

బండి సంజయ్ పాద్రయాత్రను టీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బండి యాత్రపై టీఆర్ఎస్ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈక్రమంలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించడంతో..బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

కాగా.. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను గురువారం (ఏప్రిల్ 14,2022) అలంపూర్​లో ప్రారంభించారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించేందుకే బీజేపీ పాదయాత్రను చేపట్టినట్టుగా సంజయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండో విడత పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని.. వేముల, బట్లదిన్నె, షాబాద్ మీదుగా ఉదండపూర్ వరకు సంజయ్ పాదయాత్ర కొనసాగుంది. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.