maharashtra: మ‌తాన్ని కించ‌ప‌ర్చేలా మ‌హిళ పోస్టు.. మ‌హారాష్ట్రలో క‌ల‌క‌లం

మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చ‌ర్చ‌లో నురూప్ శర్మ, సామాజిక మాధ్య‌మాల్లో న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతోన్న వేళ ఎవ్వ‌రూ రెచ్చ‌గొట్టేలా పోస్టులు చేయొద్దంటూ పోలీసులు ఎంత‌గా హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు అదే ప‌ని చేస్తున్నారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

maharashtra: మ‌తాన్ని కించ‌ప‌ర్చేలా మ‌హిళ పోస్టు.. మ‌హారాష్ట్రలో క‌ల‌క‌లం

Prophet row

maharashtra: మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చ‌ర్చ‌లో నురూప్ శర్మ, సామాజిక మాధ్య‌మాల్లో న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతోన్న వేళ ఎవ్వ‌రూ రెచ్చ‌గొట్టేలా పోస్టులు చేయొద్దంటూ పోలీసులు ఎంత‌గా హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు అదే ప‌ని చేస్తున్నారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. తాజాగా, మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కామ్‌ఠీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఇటువంటి ఘ‌ట‌న‌తోనే క‌ల‌క‌లం చెల‌రేగింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగ‌కుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహ‌రించారు.

National Herald case: రాహుల్‌ను క‌లిసిన ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు

ఆ ప్రాంతంలోని ఓ మ‌హిళ వాట్సాప్ గ్రూపులో ఓ మతాన్ని అవ‌మానించేలా పోస్టు చేసింది. ఆ పోస్టుకు మ‌ద్ద‌తుగా మ‌రో వ్య‌క్తి ఇత‌ర సామాజిక మాధ్య‌మ వేదిక‌లో పోస్టులు చేశాడు. దీంతో ఓ వ‌ర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. దీంతో సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు చేసిన మ‌హిళ‌ను, మ‌రో వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఓ వ‌ర్గానికి చెందిన వారు ఆందోళ‌న‌లు చేస్తుండ‌డంతో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

సీనియ‌ర్ పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. త‌క్ష‌ణ ప్ర‌తిస్పంద‌న బృందంతో పాటు అల్ల‌ర్ల నిరోధ‌క పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో మోహ‌రించాయ‌ని అధికారులు తెలిపారు. శాంతి, భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఎటువంటి రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.