అల్లరి నరేష్ ‘నాంది’.. షాకింగ్ లుక్..

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 01:51 AM IST
అల్లరి నరేష్ ‘నాంది’.. షాకింగ్ లుక్..

అల్లరి నరేష్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన నరేష్ గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘మహర్షి’ లో చేసిన రవి క్యారెక్టర్ తనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. కెరీర్లో ఫస్ట్ టైమ్ నరేష్ సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం ‘నాంది’ ఇది నరేష్ నటిస్తున్న 57వ సినిమా..

ప్రారంభం రోజున సినిమా టైటిల్‌తో పాటు నరేశ్ లుక్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. నరేష్ లుక్ చూసి ప్రేక్షకులు షాకయ్యారు. నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న నరేష్ లుక్ ఆసక్తికరంగా అనిపించింది. తాజాగా ‘నాంది’ నుండి నరేష్ టెర్రిఫిక్ లుక్ రిలీజ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఒంటిపై నూలుపోగు లేకుండా చేతులు తలవెనక్కిపెట్టి కూర్చున్న నరేష్ పోస్టర్ చూసి సినీ జనాలు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Naandhi

Ready to witnesss FIR (First lmpact reveal) on June 30th అంటూ ఆ రోజు మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాకు మాటలు : అబ్బూరి రవి, సంగీతం : శ్రీ చరణ్ పాకాల, ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి.

Read: వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.