Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి Terrorists kill Kashmiri Pandit in J&K's Budgam

Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి

జమ్మూ-కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్‌గా గుర్తించారు.

Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి

Kashmiri Pandit: జమ్మూ-కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ వద్ద తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాహుల్ గాయపడ్డాడు. అతడ్ని స్థానిక ఆసుపత్రికి చేర్చి, చికిత్స అందించారు. అయితే, గాయాల కారణంగా రాహుల్ చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరు టెర్రరిస్టులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

ఈ దాడిలో తీవ్రవాదులు పిస్టల్ వాడినట్లు పోలీసులు చెప్పారు. కాగా, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం జమ్మూ-కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్‌లు జరిగిన మరుసటి రోజే తీవ్రవాదులు కాల్పులు జరపడం గమనార్హం.

×