Jammu Kashmir : కశ్మీర్‌లో మరో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

కశ్మీర్‌లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు.

Jammu Kashmir : కశ్మీర్‌లో మరో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

Jammu Kashmir : కశ్మీర్‌లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు. షాపులో పని చేస్తున్న వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

చదవండి : Jammu Kashmir: ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్

మృతుడ్ని బందిపోరా జిల్లాకు చెందిన మహ్మద్ ఇబ్రహీంగా గుర్తించారు. ఆ షాపు యజమాని కశ్మీరీ పండిట్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గత 24 గంటల్లో శ్రీనగర్‌లో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం నగరంలోని బాట్మలూ ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో ఓ పోలీస్‌ మరణించినట్లు అధికారులు తెలిపారు.

చదవండి : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌..30 గంటల వ్యవధిలో 5 ఎన్‌కౌంటర్లు