లక్కీ లేడీ.. ఒక్క వాంతితో కోటీశ్వరరాలైంది..

లక్కీ లేడీ.. ఒక్క వాంతితో కోటీశ్వరరాలైంది..

Thailand woman finds whale vomit worth Rs 2 crore: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేము. కానీ, వరించందంటే రాత్రికి రాత్రే జీవితమే మారిపోతుంది. అష్ట దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడైపోతాడు. సాధారణ వ్యక్తులు కోటీశ్వరులైపోతారు. ఆ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఒక్క వాంతితో ఆమె కరోడ్ పతి అయ్యింది.

వాంతి ఏంటి, కోటీశ్వరరాలు అవ్వడం ఏంటి. అదెలా సాధ్యం అనే ధర్మ సందేహం వచ్చింది కదూ? మీకా సందేహం రావడంలో తప్పులేదు. మ్యాటర్ ఏంటంటే.. వాంతి చేసుకున్నది ఆమె కాదు, తిమింగలం (Whale). ఔను.. తిమిగిలం వాంతికి చాలా డిమాండ్ ఉంది. చాలా అరుదుగా లభించే ఈ వాంతికి కోట్ల రూపాయలు చెల్లించేందుకు పలు సంస్థలు ముందు కొస్తున్నాయి.

Woman finds 15lb lump of WHALE VOMIT worth £185,000 while walking along the beach in Thailand | Daily Mail Online

వాకింగ్ కు వెళితే అదృష్టం వరించింది:
థాయ్‌లాండ్‌లోని నాఖోన్ సి దమ్మరత్‌ ప్రావిన్స్ కు చెందిన సిరిపార్న్ అనే మహిళ(49) వాకింగ్ కోసం బీచ్‌కు వెళ్లింది. ఇసుక తిన్నెల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు దూరంగా ఓ పెద్ద రాయిలాంటిది కనిపించింది. దాన్ని తాకి చూస్తే చాలా మెత్తగా అనిపించింది. చేప వాసన రావడంతో దేనికైనా పనికొస్తుందని ఇంటికి తీసుకెళ్లింది.

Thai Woman Finds Lump of Whale Vomit Worth Rs 1.8 Lakhs

7 కిలోల బరువు, విలువ రూ.1.8కోట్లు:
పొరుగింటివారికి దాన్ని చూపించి.. దీని గురించి మీకేమైనా తెలుసా? అని అడిగింది. అది తిమింగలం వాంతి(అంబర్గ్రిస్-ambergris)లా ఉందని, దానికి చాలా విలువ ఉంటుందని వారు చెప్పడంతో సిరిపార్న్ ఆశ్చర్యపోయింది. సుమారు ఏడు కిలోల బరువున్న ఆ తిమింగిలం వాంతి విలువ రూ.1.8 కోట్లు విలువ ఉంటుందని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. సిరిపార్న్‌కు అంబర్ర్గిస్ లభించందనే సమాచారం అందుకున్న నిపుణులు.. త్వరలోనే దాన్ని పరీక్షించి నగదు అందజేయనున్నారు. దీంతో ఆ లక్కీ లేడీ త్వరలోనే కోటీశ్వరరాలు కానుంది.

Woman In Thailand Finds Whale Vomit On Shore Worth Almost 1.9 Crores

వాంతికి ఎందుకంత డిమాండ్?
‘అంబర్గ్రిస్’ అనేది స్మెర్మ్ వేల్స్ నుంచి పుడుతుంది. పొడవైన ముక్కుతో ఉండే ఈ తిమింగిలాలు స్పెర్మ్ ఆయిల్‌ను విడుదల చేస్తాయి. దాన్నే ‘అంబర్గ్రిస్’ అంటారు. తిమింగలం దాన్ని నీటిలోకి వాంతి చేస్తుంది. అదే సముద్ర తీరానికి కొట్టుకొస్తుంది. దీన్నే నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు. ‘అంబర్గ్రిస్’ను ఎక్కువగా ఖరీదైన పెర్‌ఫ్యూమ్‌లలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు వాసన కోల్పోకుండా ఉంటుంది.

జాలరి జీవితాన్ని మార్చేసిన వాంతి:
కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ జాలరికి కూడా ఇలానే తిమింగలం వాంతి దొరికింది. చేపల వేట కోసం సముద్రానికి వెళ్లగా అది లభించింది. అది అంబర్గ్రిస్ అని తేలింది. ఓ వ్యాపారి రూ.23.5 కోట్లు చెల్లించి జాలరి నుంచి దాన్ని కొన్నాడు. దీంతో జాలరి జీవితమే మారిపోయింది.