Rajinikanth : సెకండ్ డోస్ తీసుకున్న సూపర్‌స్టార్..

చెన్నై వెళ్లిన తర్వాతి రోజే రజినీ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కరోనా సోకకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు..

Rajinikanth : సెకండ్ డోస్ తీసుకున్న సూపర్‌స్టార్..

Rajinikanth

Rajinikanth: గతకొద్ది రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న తన కొత్త సినిమా షూటింగును పూర్తి చేసేశారు సూపర్‌స్టార్ రజినీకాంత్.. అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ ‘అన్నాత్తే’ మూవీకి సంబంధించి హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో ఏకధాటిగా 35 రోజలపాటు జరిగిన షెడ్యూల్‌‌తో తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్లిపోయారు..

Annaatthe : దటీజ్ తలైవా.. 35 రోజుల షెడ్యూల్‌తో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి..

తలైవా స్పెషల్ జెట్ ఫ్లైట్‌లో ఇంటికి పయనమైన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చెన్నై వెళ్లిన తర్వాతి రోజే రజినీ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కరోనా సోకకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. రజినీ వ్యాక్సిన్ తీసుకునే సమయంలో పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఆయనతో పాటే ఉన్నారు.

Rajinikanth

శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ మూవీను దీపావళి నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతమందిస్తున్నారు.

Superstar Rajinikanth