Thalaivi – Saranga Dariya​​ : ‘తలైవి’ సెన్సార్ టాక్.. ‘సారంగ దరియా’ సెన్సేషన్..

దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.. సాయి పల్లవి ‘సారంగ దరియా’ సాంగ్ మరో మైలురాయి దాటింది..

Thalaivi – Saranga Dariya​​ : ‘తలైవి’ సెన్సార్ టాక్.. ‘సారంగ దరియా’ సెన్సేషన్..

Thalaivi – Saranga Dariya

Thalaivi – Saranga Dariya​​: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. జయలలిత, విలక్షణ నటుడు అరవింద్ స్వామి.. ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.

Ilaa Ilaa song : ‘తలైవి’ వీడియో సాంగ్ చూశారా!.. కంగనా అదరగొట్టేసింది..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా పడింది. తాజాగా ‘తలైవి’ తమిళ్ సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

సినిమా చూసిన సెన్సార్ టీం.. ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. జయగా కంగన నటన, హావభావాలు చాలా బాగున్నాయని, మిగతా క్యారెక్టర్లు కూడా చక్కగా సూట్ అయ్యాయని, సినిమా పెద్ద హిట్ అవుతుందని ప్రశంసించారు. త్వరలో హిందీ, తెలుగు వెర్షన్ల సెన్సార్ జరుగనుంది.

టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి ‘సారంగదరియా’ సాంగ్ సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం. ‘దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. చాలా మంది తమ మొబైల్ కాలర్ ట్యూన్‌గా ‘సారంగదరియా’ పాటే పెట్టుకున్నారంటే పాట ఎంతలా నచ్చేసిందో చూసుకోండి మరి..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నబ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరి’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి.. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరి’ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది..

Saranga Dariya​​ : సోషల్ మీడియాలో ‘సారంగదరియా’ నయా రికార్డ్..!

తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేసిన తక్కు వ సమయంలోనే 1 మిలియన్‌కి పైగా లైక్స్, 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పాత రికార్డులను బీట్ చేసిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.. టాలీవుడ్‌లో అతి తక్కువ టైం లో 250 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా ‘సారంగ దరియా’ నిలిచింది.. అలాగే 1.6 మిలియన్ల లైక్స్ కూడా దక్కించుకుంది..