15 రోజులకే ‘మాస్టర్’ డిజిటల్ ప్రీమియర్!

15 రోజులకే ‘మాస్టర్’ డిజిటల్ ప్రీమియర్!

Master Film Digital premiere: ‘దళపతి’ విజయ్ కథానాయకుడిగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా.. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన కోలీవుడ్ కమర్షియల్ మూవీ ‘మాస్టర్’.. ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో.. ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న తమిళ్, తెలుగులో భారీగా విడుదలైంది.

మార్నింగ్ షో నుండే హిట్ టాక్, హైయ్యెస్ట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది ‘మాస్టర్’. ఇటీవలే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్), తర్వాత రూ. 200 కోట్ల క్లబ్‌లోఎంటర్ అయిన విజయ్ నాలుగో చిత్రమిది.

జనవరి 13 న రిలీజ్ అయిన ‘మాస్టర్’ జనవరి 29 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం విడుదలైన 15 రోజులకే ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్‌లోకి రానుంది. ఓ వైపు థియేట్రికల్ రన్ బాగానే ఉన్నా ఇంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ఈ ప్రభావం కచ్చితంగా కలెక్షన్ల మీద పడే అవకాశముందంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.

Master