Thane Crime : చేప పెట్టిన చిచ్చు..బంధువును హత్య చేసిన 19 ఏళ్ళ యువకుడు

చేపలు అమ్మే విషయంలో వచ్చిన గొడవ కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆ తరువాత 19 ఏళ్ల యువకుడుత తన సమీప బంధువుపై పెంచుకున్న కోపం కాస్తా హత్యకు దారితీసిన గటన థానేలో సంచలనం సృష్టించింది.

Thane Crime : చేప పెట్టిన చిచ్చు..బంధువును హత్య చేసిన 19 ఏళ్ళ యువకుడు

Crime

Thane young boy stabs relative to death over sale of fish : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ చేప కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు తన సమీప బంధువునే దారుణంగా హత్య చేసిన ఘటన డొంబివిలో ప్రాంతంలో జరిగింది. చేపలు అమ్మే విషయంలో చోటుచేసుకున్న గొడవకాస్తా పెద్దదై అది హత్య వరకు దారి తీసిందిన దారుణం ఘటనలో హితేష్‌ సంజయ్ నఖ్వాల్‌ అనే 19 ఏళ్ల యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం జరిగిన ఈ ఘటనలో పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని నవ యువకుడు జైలు పాలైన ఘటన జరిగింది.

చేప పెట్టిన చిచ్చు కాస్తా 19 ఏళ్ల యువకుడు 55 ఏళ్ల హితేష్‌ సంజయ్ నఖ్వాల్‌ అనే తన బంధువని కూడా చూడకుండా చేపల అమ్మకంలో జరిగిన గొడవను మర్చిపోకుండా మనస్సులో పెట్టుకున్నాడు. ఆ తరువాత హితేష్ తన బంధువైన భానుదాస్‌ తో గొడవపడ్డాడు. తర్వాత హితేష్‌ తన బంధువుతో బాగానే మాట్లాడాడు. జరిగిందేమీ మనస్సులో పెట్టుకోవద్దని నమ్మించాడు.తరువాత డోంబివిలీ పట్టణంలోని ఖంబల్‌పాడలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రమ్మన్నాడు. మాట్లాడే పనుంది రమ్మన్నాడు.

Read more : Gurukul Girls School : గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

దాంతో ‘కుర్రాడు కదా ఏదో ఆవేశంలో గొడవపడ్డాడు గానీ..వాడికి నామీద కోసం ఏముంటుందిలే’ అని అనుకున్న భానుదాస్ హితేష్ సంజయ్ రమ్మన చోటికి వెళ్లారు. అలా భానుదాస్ ను ఆ నిర్మానుష్యం ప్రాంతంలో పదునైన ఆయుధంతో అతని మెడపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ అఫ్లే నిందిడుతు హితేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం అంగీకరించాడని ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌ అఫ్లే తెలిపారు.

హితేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న భానుదాస్ ను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించాడు. కానీ అప్పటికే భానుదాస్ ప్రాణాలు పోయాయని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భానుదాస్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు హితేష్ పై ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుముందు హాజరుపరిచారు.

Read more :Sextortion gang: వెబ్‌సైట్‌లో నగ్నంగా వీడియో కాల్స్‌..! 200మంది నుంచి రూ.22కోట్లు దోచేసిన జంట