Jayalalitha Death Case: జయలలిత మృతి కేసులో అసలు అనుమానం అదే.. వారసులుంటే ఆ పరిస్థితి ఉండేది కాదట.

జయలలిత మృతికేసు విషయంలో ఎయిమ్స్ ఆసుపత్రి నివేదిక ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి వివరించాడు. తిరుప్పూర్ జిల్లా థారాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరైన ఆయన జయలలిత మృతి కేసు విషయంలో కీలక వ్యాఖ్యాలు చేశారు.

Jayalalitha Death Case: జయలలిత మృతి కేసులో అసలు అనుమానం అదే.. వారసులుంటే ఆ పరిస్థితి ఉండేది కాదట.

Jayalalitha

Jayalalitha Death Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఐదేళ్ల తరువాత ఆర్ముగస్వామి కమిషన్ తన నివేదికను ఈ యేడాది ఆగస్టు 25న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సమర్పించింది. ఈ నివేదికలో ఆర్ముగస్వామి పలు విషయాలను వెల్లడించాడు. తాజాగా తిరుప్పూర్ జిల్లా థారాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన జయలలిత మరణం విషయంపై మాట్లాడుతూ… పలు కీలక వ్యాఖ్యలుచేశారు.

Jayalalithaa death case: విచారణకు నేను సిద్ధం.. జయలలిత వైద్యం విషయంలో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదన్న శశికళ

జయలలిత మృతికేసు విషయంలో ఎయిమ్స్ ఆసుపత్రి నివేదిక ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరించాడు. జయలలిత మృతి గురించి ఢిల్లీ ఎయిమ్స్ తన నివేదికలో ఎలాంటి అనుమానం లేదని తెలిపిందన్నారు. కానీ, జయలలిత గుండె సమస్యే ముఖ్యమైనదని, అలాంటప్పుడు ఆంజియో చేసుండాలని, ఎందుకు చేయలేదన్నదే తన అనుమానమని అన్నారు. జయలలిత గుండెలో వెజిటేషియన్ అనే కాల్షియం డిపాజిటర్, చిన్న ద్వారమూ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిందన్నదే అందరి అభిప్రాయమని ఆర్ముగస్వామి అన్నారు.

Jayalalithaa Death Case: మాజీ సీఎం జయలలిత చికిత్సలో అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్

ముగ్గురు వైద్యులు జయలలితకు ఆంజియో లేదని చెప్పినట్లు, ఒక డాక్టర్ శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పినట్లు ఎయిమ్స్ నివేదికలో ఉందని, అందులో వైద్యులు సెరియన్, గిరినాథ్‌లు జయలలితను చూసినట్లు ఆధారాలు లేవని అన్నారు. వైద్యుడు శ్రీధర్ తాను చెప్పలేదని సాక్ష్యం ఇచ్చారని, అలాగే వైద్యుడు శ్యామువేల్ శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పలేదని వివరించారని ఆర్ముగ స్వామి అన్నారు. దీంతో నివేదికలో ఏదో లోపాలు ఉన్నట్లు నిర్ధారించుకొని ఎయిమ్స్ నివేదికను నిరాకరించానని తెలిపాడు. అయితే, ఎయిమ్స్ ఆస్పత్రిని నేను నింధించడం లేదని, జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండేవారని ఆర్ముగుస్వామి తెలిపారు. ఇదిలాఉంటే జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను నవంబర్ 17న మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.