The Baker & The Beauty : ఆహాలో కొత్త వెబ్‌ సీరీస్‌ ట్రైలర్‌ విడుదల

మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను వెబ్ సిరీస్ లో చూపించామన్నారు మేకర్స్.

The Baker & The Beauty : ఆహాలో కొత్త వెబ్‌ సీరీస్‌ ట్రైలర్‌ విడుదల

Aha The Baker And The Beauty

The Baker And The Beauty : ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణు ప్రియ కాంబినేషన్ లో రూపొందిన ఇంట్రస్టింగ్ రొమాంటింగ్ డ్రామా వెబ్ సిరీస్ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’. హైదరాబాద్ లోని కరాచీ బేకరీ ఫార్టీ ఫిఫ్త్ అవెన్యూలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మై హోమ్ గ్రూప్ డైరెక్టర్ మేఘన జూపల్లి. వెబ్ సిరీస్ హీరో, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.

ఆహాలో ఇటీవల విడుదలైన ‘కుడి ఎడమైతే’, ‘తరగతి గది దాటి’ షోలు… మంచి ఆదరణ పొందుతున్నాయన్నారు మేఘన జూపల్లి. ‘ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ’ కూడా ఆడియన్స్ ని స్పెల్‌ బౌండ్‌ చేస్తుందని చెప్పారు. ప్రతి మూమెంట్ కూడా బోర్ కొట్టకుండా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని తెలిపారు.

సెప్టెంబర్ పదో తేదీనుంచి aha ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. టీనా శిల్పరాజ్, సాయి శ్వేత, వెంకట్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా ఓటీటీ సంయుక్తంగా నిర్మించిన ఈ ‘బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్ కు జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి.

కెషత్ ఇంటర్నేషనల్ ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీని బేస్ చేసుకుని.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ది బేకర్ అండ ది బ్యూటీ ఫస్ట్ సిరీస్.. ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులరైంది. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను వెబ్ సిరీస్ లో చూపించామన్నారు మేకర్స్. బేకరీ నడుపుకునే పక్కా లోకల్‌ అబ్బాయికి, ఫిల్మ్ స్టార్ అయిన ఓ అందమైన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయన్నారు. ఏమాత్రం పొంతన లేని రెండు బ్యాక్‌గ్రౌండ్లకు చెందిన యువతీ, యువకుల మధ్య ప్రేమ.. వారి మధ్యలోకి మరో గర్ల్ ఫ్రెండ్‌ ఎంట్రీ అలరిస్తాయని చెప్పింది వెబ్ సిరీస్ టీం.