Burial Ground: స్మశానమే బెటర్ ఐసోలేషన్ సెంటర్.. అక్కడే నివాసం!

కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకొని ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ నుండి తప్పించుకునేందుకు ఎందరో ఊళ్ళకు, నగరాలకు దూరంగా వెళ్లిపోయారు. సౌకర్యం ఉన్న కాస్త ధనవంతులలో కొందరు నగరాలకు దూరంగా ఫామ్ హౌసులకు వెళ్తే..

Burial Ground: స్మశానమే బెటర్ ఐసోలేషన్ సెంటర్.. అక్కడే నివాసం!

Burial Ground

Burial Ground: కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకొని ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ నుండి తప్పించుకునేందుకు ఎందరో ఊళ్ళకు, నగరాలకు దూరంగా వెళ్లిపోయారు. సౌకర్యం ఉన్న కాస్త ధనవంతులలో కొందరు నగరాలకు దూరంగా ఫామ్ హౌసులకు వెళ్తే.. అవకాశం ఉన్న మరికొందరు గ్రామాలకు దూరంగా పంట పొలాల్లోనే తలదాచుకుని మహమ్మారికి చిక్కకుండా ఉండాలని భావించారు. కానీ.. ఓ గిరిజన తండా మాత్రం ఏకంగా స్మశానంలోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు.

ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మండలంలోని మొద్దులమడ అనే గిరిజన గ్రామంలో 150 మంది జనాభా ఉండగా అందులో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంటే దాదాపుగా ఇంటికి ఒకరు చొప్పున కరోనా బారిన పడ్డారు. దీంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ మిగతా కుటుంబసభ్యులకు వైరస్ వ్యాప్తి చేయడం కన్నా ఊరికి దూరంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసుకోవాలని భావించారు. దానికి వారి గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికనే బెస్ట్ ఐసోలేషన్ సెంటర్ గా వాళ్ళు నిర్ధారించుకున్నారు.

దీంతో గత రెండు రోజులుగా స్మశానంలోనే ఉంటున్న ఆ ప్రజలంతా అక్కడే ఉంటూ సామూహికంగానే వంటలు చేసుకొని అక్కడే తిని అక్కడే పడుకుంటున్నారు. వీరికి వారి కుటుంబ సభ్యులతో పాటు నేతలు కొంత సాయం అందిస్తున్నారు. అయితే.. ఇలా స్మశానంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకోడంపై కలెక్టరుకు చేరడంతో వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ గిరిజనులు మాత్రం అందుకు ఇష్టపడలేదు. తమకి అక్కడే సౌకర్యంతో పాటు స్వేచ్ఛ ఉందని అధికారులకు చెప్పడంతో చేసేదేం లేక వారు వెనక్కితగ్గారు.