Assembly Seats: అప్పటి వరకు ఆగాల్సిందే..! తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

Assembly Seats: అప్పటి వరకు ఆగాల్సిందే..! తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Asambley Seats

Assembly Seats: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అని, అంత వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

China: మా దేశంపై దాడి చేసేందుకు చైనా ఆర్మీకి 2025లోపు పూర్తి సామ‌ర్థ్యం: తైవాన్

విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని, అయితే 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్ర మంత్రి అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నాటినుంచి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చకొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్ 26(1) ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ చట్టంలోని సెక్షన్-15 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచేందుకు నిర్ణయించారు.

Rare Pink Diamond : అంగోలాలో లభ్యమైన ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ డైమండ్..విలువ రూ.900ల కోట్లకు పైనే

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం.. 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభాకు సంఖ్యకు అనుగుణంగా సీట్ల పెంపు జరుగుతుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ లెక్కన మరో పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదన్న వాదనను నిఫుణులు వ్యక్తం చేస్తున్నారు.