Voter Registration : ఓటరు నమోదులో కీలక మార్పులు..ఆగస్టు 1 నుంచి కొత్త మార్గనిర్దేశకాలు

ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ఓటరుతో ఆధార్ అనుసంధానం చేయాలని సూచించింది. ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి తమ ఆధార్‌ నంబరు అనుసంధానించాలని తెలిపింది.

Voter Registration : ఓటరు నమోదులో కీలక మార్పులు..ఆగస్టు 1 నుంచి కొత్త మార్గనిర్దేశకాలు

Voter

Voter Registration : ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ఓటరుతో ఆధార్ అనుసంధానం చేయాలని సూచించింది. ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి తమ ఆధార్‌ నంబరు అనుసంధానించాలని తెలిపింది.

అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందం, ఆధార్‌ నెంబర్ ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఆధార్‌ నెంబర్ అనుసంధానం చేయవచ్చని తెలిపింది. ఓటర్ల జాబితాల సవరణలలో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయి.

Young Voters: పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు.. ఈసీ నిర్ణయం

మరోవైపు 17 ఏళ్లు నిండిన యువత ముందుస్తుగా ఓటు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తద్వారా 18 ఏళ్లు వచ్చాక ఓటు నమోదు అవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇప్పటివరకు 18 ఏళ్ల వయసు ఉన్న యువత అర్హతను బట్టి జనవరి 1కి ముందే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది.

జనవరి 1 తర్వాత 18 ఏళ్లు నిండినా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించడం లేదు. ఏడాదిపాటు వేచిచూడాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తీసుకుంది.