Srikanth: అఖండ తర్వాత.. నన్ను అభిమానించిన మహిళలే ద్వేషిస్తారు

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ అభిమానులకు దగ్గరైన సీనియర్ హీరోలలో శ్రీకాంత్ ఒకడు. అప్పట్లో శోభన్ బాబు.. ఆ తర్వాత జగపతి బాబు, శ్రీకాంత్ మహిళా అభిమానులను సంపాదించుకొని భారీ మార్కెట్ దక్కించుకొనేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది.

Srikanth: అఖండ తర్వాత.. నన్ను అభిమానించిన మహిళలే ద్వేషిస్తారు

Akhanda (1)

Akhanda: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ అభిమానులకు దగ్గరైన సీనియర్ హీరోలలో శ్రీకాంత్ ఒకడు. అప్పట్లో శోభన్ బాబు.. ఆ తర్వాత జగపతి బాబు, శ్రీకాంత్ మహిళా అభిమానులను సంపాదించుకొని భారీ మార్కెట్ దక్కించుకొనేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. మధ్యవయసు దగ్గరైన ఈ హీరోలు ఇప్పుడు అందుకే తనదైన స్టైల్ లో పాత్రలను ఎంచుకొని మళ్ళీ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే జగపతి బాబు బాలయ్య-బోయపాటి కాంబినేషన్ తోలి సినిమా లెజెండ్ లో విలన్ గా మారగా అది జగపతికి భారీ క్రేజీ టర్నింగ్ తెచ్చిపెట్టింది.

ఇక ఇప్పుడు శ్రీకాంత్ వంతు వచ్చింది. బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా అఖండ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన సినిమాలలో విలన్ లను క్రూరంగా చూపించే బోయపాటి.. అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా చూపిస్తున్నాడు. అయితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అఖండ సినిమా గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో తాను విలన్ వరదరాజులు అనే పాత్రను పోషిస్తున్నానని చెప్పిన శ్రీకాంత్.. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

కాగా తన పాత్రపై శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్లు తనను ప్రేమించిన ఆడవాళ్లు.. అఖండ చూసిన తర్వాత అంత ద్వేషిస్తారని చెప్పాడు. దీనిని బట్టి అఖండలో శ్రీకాంత్ ను బోయపాటి మరింత క్రూరంగా చూపించనున్నాడో అర్ధమవుతుంది. ప్రేక్షకులు విలన్ ను ఎంత ద్వేషిస్తే హీరోను అంతగా ప్రేమిస్తారని.. అందుకే బోయపాటి తన సినిమాలలో విలన్ ను టార్గెట్ చేస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా.. పరిస్థితిలు అనుకూలంగా మారితే సెప్టెంబర్ నెలలో అఖండ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి.. ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి!