Kaleshwaram: త్రివేణి సంగమం పుష్కర ఘాట్లును తాకిన నీటి ప్రవాహం

మహారాష్ట్రలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి దిగువకు చేరుతుంది. మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత పరుగులు పెరుగుతుండటంతో..

Kaleshwaram: త్రివేణి సంగమం పుష్కర ఘాట్లును తాకిన నీటి ప్రవాహం

Kaleshwaram

Kaleshwaram: మహారాష్ట్రలో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి దిగువకు చేరుతుంది. మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ప్రాణహిత పరుగులు పెరుగుతుండటంతో గోదావరిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జలకళ తొణికిసలాడుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం పుష్కర ఘాట్లును తాకి ప్రవహిస్తోంది.

దీంతో వర్షకాలం ప్రారంభంలోనే త్రివేణి సంగమం వద్ద జలకళతో సందడి నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం పుష్కర ఘాట్లను తాకి ప్రవహిస్తోంది. మరోవైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీకి ఎగువ నుంచి వరద వస్తుండటంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేటుతుండగా వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.