Clouded Leopard : స‌రామ‌తి ప‌ర్వ‌తంపై కనిపించిన అరుదైన చిరుత

భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని తూర్పు నాగాలాండ్ లో వేల మీటర్ల ఎత్తులో స‌రామ‌తి ప‌ర్వ‌తం అనే పర్వతంపైన అరుదైన మేఘావృతమైన చిరుతపులి కెమెరా కంటికి చిక్కింది.

Clouded Leopard : స‌రామ‌తి ప‌ర్వ‌తంపై కనిపించిన అరుదైన చిరుత

Clouded Leopard

Clouded Leopard : చిరుత. వాయువేగం దీని సొంతం. జింకను వేటాడే సమయంలో చిరుత వేగం చూడాలంటే కాస్త స్లో మోషన్ లో చూడాల్సిందే.అంతటి వేగంకల చిరుత బాణంలా దూసుకుపోతు వేటాడే తీరు ఉత్కంఠను కలిగిస్తుంది. చిరుతల్లో చాలారకాలుంటాయి. కానీ ఇటీవల భారత్- మ‌య‌న్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్ లో కెమెరాకు ఓ అరుదైన జాతికి చెందిన చిరుత చిక్కింది.

దాన్ని Clouded Leopard అంటారు. ఇది ఎక్కువ‌గా ఎత్తైన ప్ర‌దేశాల్లో మాత్ర‌మే ఉంటుంది. మేఘాలను తాకేంత ఎతైన కొండ‌లు, గుట్ట‌లు,పర్వతాల్లో నివసిస్తాయి. అందుకే ఈ జాతి పులులకు క్లౌడెడ్ లెపార్ట్ అనే పేరు వ‌చ్చింది. ఈ పులులు చాలా అరుదైనవి. అటువంటి అరుదైన జాతికి చెందిన ఓ చిరుత‌పులి ఇండియా-మ‌య‌న్మార్ సరిహద్దుల్లోని 3700 మీట‌ర్ల ఎత్తులో నాగాలాండ్ రాష్ట్రంలో క‌నిపించింది.

Read more : అంతరించిపోలేదు : 50ఏళ్లకు కనిపించిన పాటలు పాడే కుక్క

సాధారణంగా చిరుతలు అవలీలగా చెట్లు ఎక్కేస్తాయి. వేటాడిన జంతువును నోట కరచుకుని చెట్టు ఎక్కేసి చెట్ల కొమ్మల మధ్యలో ఆ జంతువును పెట్టి తాపీగా తింటాయి. అలాగే ఈ క్లౌడెడ్ లెపార్ట్ జాతి చిరుతలు కూడా ఎంత పెద్ద చెట్లు అవలీలగా ఎక్కేస్తాయి. ఈ చిరుతలను Neofelis nebulosa అని కూడా పిలుస్తారు.

ఇవి చిరుతలంత ఇవి పెద్ద‌పులులంత సన్నగా పొడవుగా ఉండవు. అలాగని పెద్దపులులంతా పెద్ద‌గాను ఉండ‌వు. మీడియం సైజ్‌లో ఉంటాయి. ఢిల్లీకి చెందిన Wildlife Protection Society of India అనే ఓ ఎన్జీవో నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా తాన‌మిర్ గ్రామంలో ఉన్న అడ‌విలో కొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. త‌మ రీసెర్చ్ కోసం.. అడ‌వుల్లో ఉన్న జంతువుల ఫోటోలు, వీడియోలు క్యాప్చ‌ర్ చేయ‌డం కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు అవి. ఆ కెమెరాకు ఈ చిరుత పులి చిక్కింది.

ఒడిషాలో అరుదైన బ్లాక్ టైగర్

తూర్పు నాగాలాండ్ లోని కిఫిరే జిల్లాలోని థానమీర్ గ్రామంలోని కమ్యూనిటీ ఫారెస్ట్ లో 3,700మీటర్ల ఎత్తులో స‌రామ‌తి ప‌ర్వ‌తం అనే పర్వతంపైన ఈ అరుదైన మేఘావృతమైన చిరుతపులి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫారెస్ట్ 65 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

స‌రామ‌తి ప‌ర్వ‌తం అంటే నాగాలాండ్‌లోనే అత్యంత ఎత్తైన ప్ర‌దేశం. అక్క‌డే ఈ జాతికి చెందిన చిరుత పులులు సంచ‌రిస్తుంటాయి. తాన‌మిర్ ప్రాంతంలో ఉండే బ‌యో డైవ‌ర్సిటీ క‌ల్చ‌ర్‌పై డాక్యుమెంట‌రీ తీయ‌డం కోసం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్ష‌న్ సొసైటీ ఆఫ్ ఇండియా రీసెర్చ‌ర్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. త‌మ కెమెరాల్లో రెండు చిరుతపులులు, రెండు వాటి పిల్ల‌లు క‌నిపించాయ‌ని రీసెర్చ‌ర్స్ స్పష్టం చేశారు.