Rajanna Sircilla: దారుణం.. కరోనా సోకిందని బాలికను ఊరి నుండి వెలేశారు!

గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించేది కాదు. కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతున్నా సాటి మనిషిలో చలనం కనిపించేది కాదు. కానీ సెకండ్ వేవ్ సమయానికి కొంతమార్పు వచ్చింది. కరోనా పేషేంట్ ను కూడా సాధారణ రోగి మాదిరే కొందరు సేవలు చేస్తున్నారు. కానీ, పల్లెలు.. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కొన్నిచోట్ల అమానుష ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Rajanna Sircilla: దారుణం.. కరోనా సోకిందని బాలికను ఊరి నుండి వెలేశారు!

The Girl Was Expelled From The Village Due To Corona Virus

Rajanna Sircilla: గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించేది కాదు. కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతున్నా సాటి మనిషిలో చలనం కనిపించేది కాదు. కానీ సెకండ్ వేవ్ సమయానికి కొంతమార్పు వచ్చింది. కరోనా పేషేంట్ ను కూడా సాధారణ రోగి మాదిరే కొందరు సేవలు చేస్తున్నారు. కానీ, పల్లెలు.. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కొన్నిచోట్ల అమానుష ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కరోనా సోకిన ఓ బాలికను ఊరి నుండి వెలివేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాకు చెందిన బాలిక అత్యాచార బాధితురాలు అవడంతో పోలీసులు గత 20 రోజుల క్రితం సఖీ కేంద్రానికి తరలించారు. అయితే.. అక్కడ సంరక్షణ గడువు తీరడం.. అదే సమయంలో బాలికకు కరోనా సోకడంతో సఖి కేంద్రం అధికారులు బాలికను ఇంటికి పంపించారు. కానీ, బాలిక గ్రామస్తులు ఊరిలోకి రాకుండా వెలేశారు. అసలే అత్యాచార బాధితురాలు కావడం.. పైగా కరోనా సోకడంతో ధైర్యం చెప్పాల్సిన గ్రామస్తులు ఆమెను మరింత కృంగదీశారు.

గ్రామస్థులు ఊరికి రాకుండా అడ్డుకోవడంతో బాలిక సమీప పంట పొలాల్లో ఓ ప్లాస్టిక్ పట్టాతో గుడిసె వేసుకొని అక్కడే నివాసం ఉంటుంది. బాలికకు తోడుగా ఆమె తల్లి ధైర్యం చేసి అక్కడే ఉంటుంది. వర్షం పడుతున్నా ఆ గుడిసెలోనే బాలిక, తల్లి ఉండిపోవడం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్పందించిన అధికారులు ముందుగా ఆ ఇద్దరికీ స్థానిక పాఠశాల భవనంలో షెల్టర్ ఏర్పాటుచేశారు. కానీ అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో చివరికి సిరిసిల్ల మండలం సర్దపూర్ ఐసోలేషన్ సెంటర్ కి తరలించారు.