Viral Video: పెళ్ళిలో కాళ్ల మీద పడ్డ వరుడు.. ఆశీర్వదించిన వధువు!

పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది.

Viral Video: పెళ్ళిలో కాళ్ల మీద పడ్డ వరుడు.. ఆశీర్వదించిన వధువు!

Viral Video

Viral Video: పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది. అయితే.. కాలక్రమేణా కొన్ని మార్పులు, చేర్పులతో ఈ సంప్రదాయంలో వినూత్నత జోడిస్తున్నారు. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా ఆచార, సంప్రదాయాన్ని పూర్తి భిన్నంగా మార్చేశారు.

Big Boss 4 Winner: అభిజిత్‌కు అనారోగ్య కారణాలు.. అందుకే సినిమాలకు దూరం!

సహజంగా భారతీయ సాంప్రదాయ సాంప్రదాయ వివాహాలలో వధువు వరుడి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే, ఓ జంట ఇందుకు భిన్నంగా వరుడు వధువు కాళ్ళకి మొక్కితే వధువు ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుడు చేసిన ఆలోచనతో వధువుతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు. పెళ్లి వేడుక అనంతరం.. వధువు ఆశీర్వాదం తీసుకోవడానికి వరుడి కాళ్ల మీద పడుతుండగా.. వెంటనే ఆ వరుడు ఆమెను అడ్డుకొని.. అతనే ఆమె కాళ్ల మీద ప‌డ్డాడు.

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

దీంతో ఒక్క‌సారిగా ఆ వధువు షాక్ అయ్యి వెంట‌నే త‌న కాళ్ల‌ను వెన‌క్కి జ‌రుపుకుంటుంది. కానీ అతను మాత్రం ఆమె కాళ్ళకి నమస్కరించాడు. దీంతో ఆమె మనసును గెలుచుకోడమే కాదు.. ఈ వీడియోతో నెటిజన్ల మనసును కూడా గెలుచుకున్నాడు. భార్యభర్తలంటే ఇద్దరు సమానంగా భావించి ఆమె తన కాళ్ల మీద పడినప్పుడు తాను అలా చేస్తే తప్పేంటి అని ఇలా చేసినట్లు నెటిజన్లు వివరిస్తుండగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వాళ్ల‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Piyush Awchar (@mr_robin_hudd)