Heavy Rains : తెలంగాణలో మూడు రోజుల్లో భారీ వర్షాలు

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.

Heavy Rains : తెలంగాణలో మూడు రోజుల్లో భారీ వర్షాలు

Rains

forecast heavy rains : నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో 13.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపింది.

Monsoons : తెలుగు రాష్ట్రాలను పలకరించిన నైరుతి రుతుపవనాలు

ఇవాళ పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

రేపు ఉమ్మడి కరీంనగర్‌, నల్లగొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ కేంద్రం.ఈ మూడు రోజులు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.