Radio Telescope : విశ్వశోధనకోసం ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణం

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు గాను ఆస్ట్రేలియా, చైనా , ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్ డబ్ లు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ టెలిస్కోప్ నిర్మాణానికి రెండు బిలియన్ డాలర్లు అనగా 14వేల 928 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచానా వేశారు.

Radio Telescope : విశ్వశోధనకోసం ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణం

విశ్వశోధనకోసం అతిపెద్ద టెలిస్కోప్

Radio Telescope : శాస్త్ర సాంకేతిక పరిజ్జానం రోజుకో మైలు రాయిని దాటుతుంది. పరిశోధకుల శోధనలు సరికొత్త ఆవిష్కరణలను మనముందుంచుతున్నాయి. విశ్వంలో అణువణువును శోధించేందుకు, అంతర్లీనంగా దాగి ఉన్న విషయాలను తెలుసుకునేందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఝానం ఇప్పుడు ఎంతగానో దోహదపడుతుంది. ఈ క్రమంలోనే 30 ఏళ్ళుగా ప్రణాళికల దశలోనే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ద స్క్వేర్ కిలోమీటర్ ఆరే అబ్జర్వేటరీ అనే భారీ టెలిస్కోప్ , దక్షిణాఫ్రికా , అస్ట్రేలియాలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

రెండు వందల అతిపెద్ద డిష్ రిసీవర్ లు, కోటికిపై గా చిన్న యాంటెనాలతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెలిస్కోప్ లకంటే దాదాపు పదిరెట్ల అధిక సామర్ధ్యం కలిగి ఉంటుంది. అతిపెద్ద దైన ఈ టెలిస్కోప్ ద్వారా 70 మెగా హెడ్జ్ ల నుండి 25 గిగా హెడ్జల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను వినగలదు. 50 సంవత్సరాలపాటు వినియోగించుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఎస్ కే ఏఓ మధ్య శ్రేణి వ్యవస్ధను దక్షిణాఫ్రికాలోని కరూ ఎడారిలో 50 అడుగుల వ్యాసార్ధంలో 197 డిష్ లతో ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ శ్రేణి ఫ్రిక్వెన్సీని వినగలిగే వ్యవస్ధను 1,32,072 యాంటెనాలతో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు గాను ఆస్ట్రేలియా, చైనా , ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్ డబ్ లు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ టెలిస్కోప్ నిర్మాణానికి రెండు బిలియన్ డాలర్లు అనగా 14వేల 928 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచానా వేశారు. 2029నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు. దీనిని ఉపయోగించి 2024 నుండే పరిశోధనలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఈ ప్రాజెక్టులో ఇండియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, స్విజ్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలు పరిశీలక దేశాలుగా వ్యవహరించనున్నాయి. ఈ అతిపెద్ద టెలిస్కోప్ ద్వారా అంతుచిక్కని అనేక ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాశం ఉంటుందని, గెలాక్సీలు, గ్రహాల పూర్తిస్ధాయి శోధనకు అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.