Crime News: జార్ఖండ్‌లో దారుణం.. పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించిన వ్యక్తి..

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 19ఏళ్ల యువతికి రాజేష్ రౌత్ అనే వ్యక్తి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Crime News: జార్ఖండ్‌లో దారుణం.. పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించిన వ్యక్తి..

Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 19ఏళ్ల యువతికి రాజేష్ రౌత్ అనే వ్యక్తి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో రాంచీలోని ఓ ఆస్పత్రిలో యువతి ప్రాణాలతో పోరాడుతోంది. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.

Crime News: దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్రియుడితో తండ్రిని హత్య చేయించిన కుమార్తె.. సహకరించిన తల్లి.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

ఫిబ్రవరిలోనే పెళ్లి జరిగినప్పటికీ తనను పెళ్లిచేసుకోవాలని రాజేష్ రౌత్ 19ఏళ్ల యువతి వెంటపడేవాడని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శివేంద్ర ప్రసాద్ తెలిపారు. 2019 నుంచి ఇద్దరు ఒకరికొకరు తెలుసునని అన్నారు. పెళ్లి చేసుకోవాలని రాజేష్ రౌత్ మహిళ వెంట పడుతున్నట్లు తెలిపారు. రౌత్ ప్రతిపాదనను యువతి, ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించారని అన్నారు. అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న రాజేష్ రౌత్ .. పలుసార్లు యువతిని బెదిరింపులకు గురిచేశాడని శివేంద్ర ప్రసాద్ తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తీవ్ర గాయాలపాలైన యువతిని మెరుగైన చికిత్స నిమిత్తం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు రెఫర్ చేసినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. అక్కడ ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. జిల్లా యంత్రాంగం యువతి కుటుంబానికి చికిత్స కోసం తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 1 లక్ష అందించారు.