Train Horns : రైలు కూతలకు అర్ధాలే వేరులే…

రైలు ప్రయాణం వేగంగా సాగుతున్నసమయంలో క్రాసింగ్ లను దాటే సందర్భంలో పట్టాలు దాటే వారిని అప్రమత్తం చేయటం లోకో పైలట్ బాధ్యత. అలాంటి సందర్భంలో పట్టాలు దాటే

Train Horns : రైలు కూతలకు అర్ధాలే వేరులే…

Horn

Train Horns :  ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేర్చటంలో రైళ్ళది కీలకపాత్ర. రైలు  ప్రయాణం ప్రారంభమయ్యే సమయం నుండి తిరిగి గమ్యస్ధానం చేరే వరకు సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. రైలు చాలా పొడవైనది కావటంతో టి.సిలు, గార్డులు, ప్రయాణికులు, ఇతర రైల్వే సిబ్బంది అందరికి సంకేతాలు అందించటం కష్టమౌతుంది. టిసిలు, గార్డుల వద్ద వైరెలెస్ సెట్లు ఉన్నప్పటికీ కొంత సమాచారం వారికి మాత్రమే తెలిసేలా ఉంటుంది. అందరిని అప్రమత్తం చేయాలంటే లోకోపైలట్ లు రైలు హారన్ సంకేతాలను మోగిస్తుంటారు. 11రకాల రైలు కూతలు ఉండగా వాటికి విభిన్న రకాలు అర్ధాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…

రైలు కూతలకు అర్ధాలు ఇవే..

* లోకో పైలట్ తక్కువ శబ్ధంతో వినిపించేలా చిన్నహారన్ సౌండ్ చేస్తే రైలును యార్డుకు తీసుకువెళుతున్నారని అర్ధం చేసుకోవాలి. ప్రయాణికులను గమ్యస్ధానం చేర్చిన తరువాత యార్డులో దానిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆసమయంలో ఈ తరహా హారన్ వినియోగిస్తారు.

* రైలు స్టేషన్ నుండి బయలు దేరేందుకు సిగ్నల్ ఇవ్వాలని గార్డును కోరేందుకు లోకో పైలట్ హారన్ రూపంలో సంకేతాలిస్తాడు. చిన్నశబ్ధంతో కలిగి రెండు సార్లు హారన్ మోగిస్తే రైలు వెళ్ళేందుకు సిగ్నల్ ఇవ్వాల్సిందిగా గార్డును కోరటమన్నమాట.

* మూడు సార్లు చిన్న హారన్ ల శబ్ధం చేస్తే ఇంజన్ పై కంట్రోల్ పోయిందన్న సంకేతం. ఈ సంకేతాన్ని లోకో పైలట్ గార్డుకు ఇస్తాడు. ఈ హారన్ శబ్ధాలతో లోకో పైలట్ అప్రమత్తమై తన వద్ద ఉన్న వ్యాక్యూమ్ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. ఈ హారన్ ను అత్యంత అరుదుగా ఉపయోగిస్తారు.

* రైలు ఇంజన్ స్టార్ట్ చేయటానికి ముందు బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై గార్డును అప్రమత్తం చేసేందుకు లోకో పైలట్ ఒక లాంగ్ సౌండ్ హారన్, మరో తక్కువ శబ్ధం కలిగిన హారన్ ను మోగించటం ద్వారా గార్డుకు సంకేతాలు జారీచేస్తాడు.

* రైలు ఇంజన్ ను కంట్రోల్ లోకి తీసుకోవాలని గార్డుకు సూచనలు చేసేందుకు లోకో పైలట్ రెండు లాంగ్ హారన్ లు , రెండు షార్ట్ హారన్ లు ఇస్తాడు.

* రైలులో అనుకోకుండా సాంకేతిక సమస్యను గుర్తించిన వెంటనే లోకో పైలట్ నాలుగు సార్లు చిన్న హారన్ లను మోగిస్తాడు. ఈ నాలుగు సార్లు చిన్న హారన్ లు మోగితే రైలు ముందుకు వెళ్ళటానికి రెడీగా లేదని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

* రైలు సంబంధిత స్టేషన్ లో ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు వీలుగా లోకో పైలట్ నిరంతరాయంగా హారన్ మోగిస్తూ ఉంటాడు. ఇలా హారన్ మోగిస్తూ ఉంటే వచ్చే స్టేషన్ లో హాల్ట్ లేదని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ ప్రెస్ రైళ్ళు, నాన్ స్టాప్ రైళ్ళు స్టేషన్ కు వచ్చే సమయంలో ఇలాంటి హారన్ లను వినవచ్చు.

* రైలు ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్ కు మారే సమయంలో హారన్ ల ద్వారా సంకేతాలు ఇస్తారు. ఆసమయంలో రెండు లాంగ్ హారన్ లు , రెండు చిన్నహారన్ లను స్వల్ప విరామంతో మోగించటం ద్వారా లోకో పైలట్ రైలు పట్టాలు మారుతున్నట్లు సూచనిలిస్తాడు.

* రైలు ప్రయాణం వేగంగా సాగుతున్నసమయంలో క్రాసింగ్ లను దాటే సందర్భంలో పట్టాలు దాటే వారిని అప్రమత్తం చేయటం లోకో పైలట్ బాధ్యత. అలాంటి సందర్భంలో పట్టాలు దాటే వారికి రైలు వస్తుందన్న సంకేతాలు ఇచ్చేలా రెండు హారన్ లను స్వల్ప విరామంతో మోగిస్తాడు.

* రైలు ప్రమాదకర పరిస్ధితుల్లో ఉన్నప్పుడు లోకో పైలట్ అందరిని అప్రమత్తం చేసేలా ఆరుసార్లు షార్ట్ హారన్ లు మోగిస్తాడు. ఈ హారన్ లు వినిపించిన వెంటనే సిబ్బంది, ప్రయాణికులంతా అప్రమత్తంగా ఉండాలని అర్ధం.

* కొన్ని సందర్భాల్లో రైలు వెళుతున్న క్రమంలో కొంత మంది ప్రయాణికులు చైను లాగుతుంటారు. అలాగే గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ లాగినా వెంటనే లోకో పైలట్ కు సంకేతాలు వెళతాయి. ఈ క్రమంలో లోకో పైలట్ అందరిని అప్రమత్తం చేసేందుకు రెండు షార్ట్ హారన్ లు, ఒక లాంగ్ హారన్ మోగిస్తాడు.

ఇలా రైలు హారన్ లకు సంబంధించి తెరవెనక ఉన్న సంకేతాలివి. మీరెప్పుడైన ఇకపై రైలులో ప్రయాణిస్తుంటే ఇలాంటి హారన్ లు విన్నట్లైతే వాటి సంకేతాలను మీరే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. చాలా మందికి రైలు హారన్ సంకేతాల గురించి తెలియదు. మీరు తెలుసుకున్న ఈ వివరాలను వారితో పంచుకుంటే వారికి తెలియని విషయాలను తెలియజేసిన వారవుతారు.