Female : ఆడవారి జెడల వెనుక అర్ధాలే వేరులే!

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది. అలా వదిలి వేయడం వలన కోరికలు పెరిగి అశాంతి ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు. జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది.

Female : ఆడవారి జెడల వెనుక అర్ధాలే వేరులే!

Hair Style

Female : మహిళలంటేనే అందం…అయితే ఆ అందానికి తలపై ఉండే జుట్టు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. వివిధ రకాల వయస్సుల్లో స్త్రీలు తమ జుట్టును వివిధ రకాలుగా జడలు అల్లుతారు. స్త్రీలు జడలల్లే పద్దతుల వెనుక అనేక అర్ధాలు కూడా దాగి ఉన్నాయి. పురాతన కాలం నుండి అచార సాంప్రదాయాల్లో ఈ పద్దతులు బాగం అయ్యాయి. ఆడపిల్లలు రెండు జడలు వేసుకుంటే.. ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం.. పెళ్లి అయ్యిన వారు అయితే మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడ గా వేసుకుంటారు. అంటే ఆమె తన భర్త తో కలిసి ఉంటోందని అర్ధం. అలా కాకుండా.. జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ సంసారజీవితం సాగిస్తుందన్నమాట.

అదే క్రమంలో జడలోని మూడు పాయలకు రకరకాల అర్ధాలు ఉన్నాయి. తానూ, తనభర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం. అలాగే సత్వ, రజ, తమో గుణాలు, అలాగే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు ఉన్నట్లు పెద్దలు చెప్తుంటారు. అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి.

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది. అలా వదిలి వేయడం వలన కోరికలు పెరిగి అశాంతి ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు. జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. అలాగే రెండు చేతులతో తల గోక్కో కూడదు. తల స్నానం చేశాక జుట్టు లోంచి నీటి చుక్కలు కింద పడకూడదు. ఇలా పడటం అరిష్టమని అంటారు. అందుకే పూర్వం వారు తలస్నానం పూర్తయిన వెంటనే తలకి టవల్ , కాటన్ క్లోత్ ని గాని చుట్టుకునేవారు.