Meme Photo : దోస్త్ కు కటీఫ్ చెప్పిన మీమ్..38లక్షలకు అమ్ముడు పోయింది.

పాకిస్ధాన్ లోని గుజ్రన్ వాలాకు చెందిన ఆసిఫ్ రాజాకు తన ప్రాణ స్నేహితుడు ముదసిర్ ఇస్మాయిల్ అహ్మద్ తో గొడవ జరిగింది.

Meme Photo :  దోస్త్ కు కటీఫ్ చెప్పిన మీమ్..38లక్షలకు అమ్ముడు పోయింది.

Friendship

Meme Photo : దోస్తానాకు కటీఫ్ చెప్పిన వాడు అంతటితో సరిపెట్టకుండా ఆ విషయాన్ని ఊరందరికి తెలిసేలా చెప్పాలనుకున్నాడు. పనిలో పనిగా కటీఫ్ అయిన దోస్త్ తోపాటు కొత్త గా స్నేహితుడైన వ్యక్తి ఫోటోను జతచేసి మీమ్ గా మార్చి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అక్కడి నుండే అతనికి అదృష్టం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన మీమ్ అతనికి ఏకంగా లక్షల డబ్బులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే..

పాకిస్ధాన్ లోని గుజ్రన్ వాలాకు చెందిన ఆసిఫ్ రాజాకు తన ప్రాణ స్నేహితుడు ముదసిర్ ఇస్మాయిల్ అహ్మద్ తో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు స్నేహితులు విడిపోయారు. స్నేహం బ్రేకప్ అయిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలనుకున్నాడు ఆసిఫ్ రాజా. ఆక్రమంలోనే ఇస్మాయిల్ తో తన స్నేహం కట్ అయ్యిందని ఇకపై తన స్నేహితుడు సల్మాన్ అహ్మద్ నక్వష్ అని రాసి ఓ పోస్టు పెట్టాడు. ఫోస్టులోనే కొత్త ఫ్రెండ్ తో దిగిన ఫోటోతోపాటు, తన పాత ఫ్రెండ్ ఫోటోలను క్రాస్ మార్కు పెట్టి మీమ్ లా ఆసిఫ్ రాజా క్రియేట్ చేశాడు.

అయితే ఇదంతా జరిగింది 2015లో అప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్ ఎఫ్ టీ వేలంలో ఈ మీమ్ 38లక్షల రూపాయలు పలికింది. సరిగ్గా స్నేహితుల దినోత్సవం రోజునే దీనిని అమ్మేశారు. దీంతో ఆముగ్గురు యువకులు ఫేమస్ గా మారగా, లక్షాధికారి నయ్యానని ఆసిఫ్ రాజా తెగ సంతోషపడిపోతున్నాడు.