Tamil Nadu : ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి..రెండు సార్లు ప్రేమ విఫలమై..

ప్రేమ కొందరి జీవితాలలో సంతోషాన్ని నింపితే కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ప్రేమించిన వాళ్లను గెలుచుకోవటం అంత తేలికైన విషయం కాదు.

Tamil Nadu : ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి..రెండు సార్లు ప్రేమ విఫలమై..

Tamilnadu Missing Man

Tamil Nadu :  ప్రేమ కొందరి జీవితాలలో సంతోషాన్ని నింపితే కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ప్రేమించిన వాళ్లను గెలుచుకోవటం అంత తేలికైన విషయం కాదు. జీవితంలో రెండు సార్లు ప్రేమలో ఫెయిలైన వ్యక్తి మతి స్ధిమితం కోల్పోయి మూడేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న విషాద గాధ తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా  తెన్నమలైకి  చెందిన ముత్తు(35) రాజపాళయంలో బీకాం చదివాడు. మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ చేసాడు. చెన్నైలోని ఒక కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం సంపాదించుకుని ఐఏఎస్ కు  కోచింగ్ తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.  అతనికి కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక విద్యార్ధిని తోనూ…ఉద్యోగం చేసే చోట మరోక  మహిళతోనూ ప్రేమ వ్యవహారం నడిచింది.

ఈ రెండు ప్రేమ వ్యవహారాల్లోనూ అతను ఫెయిలై వాళ్లు వేరే వాళ్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. దీంతో  మనస్తాపం చెంది విఫల ప్రేమికుడై  2018 నవంబర్ 13వ తేదీ రాత్రి చెన్నైలోని తన వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి ముత్తు అకస్మాత్తుగా ఆదృశ్యమయ్యాడు. ముత్తు కుటుంబ సభ్యులు, బంధువుల అతని కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతను ఎక్కడున్నాడో చెప్పలేకపోయారు.

ఈక్రమంలో ముత్తు గ్రామానికే చెందిన అతని బంధువు మురుగన్ అనే వ్యక్తి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారికి   ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో వెళ్లాడు.  కన్యాకుమారిలో  అన్నీ చూసిన తర్వాత  తిరుగు ప్రయాణానికి  రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక బ్యాంక్ వద్ద చింపిరి జుట్టుతో…మాసిన గడ్డంతో మతిస్ధిమితం తప్పిన వాడిలా ఉన్న ఒక వ్యక్తిని చూశాడు.

New Project

కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తమ బంధువు ముత్తులాగా అనిపించి అతనిని గమనించసాగాడు. మతి స్ధిమితం లేని వ్యక్తి ఇంగ్లీషు పేపర్లు  చదవటం గమనించాడు. నిర్ధారించుకునేందుకు అతని వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు. మొదట అతడితో మాట్లాడేందుకు నిరాకరించాడు ఆవ్యక్తి.  కొద్ది సేపటికి మురుగన్‌తో మాట కలిపాడు.  అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారణ అయ్యింది.  దాదాపు నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన ముత్తుగా గుర్తించాడు.

వెంటనే సమీపంలోని పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకు  వెళ్లాడు. ఇంతలో తెన్నామలై లోని ముత్తు బంధువులకు సమాచారం ఇచ్చాడు. సెలూన్‌లో అతనికి పెరిగిన క్రాపు, జుట్టు కత్తిరించి గుండు కొట్టించారు పోలీసులు. తర్వాత స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు. కుటుంబ సభ్యుల వచ్చి ముత్తును గుర్తించారు. ముత్తుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు చూపించటంతో వారు ముత్తును కుటుంబ సభ్యులకు అప్పగించారు. కన్యాకుమారి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపి ముత్తును కుటుంబ సభ్యులు తమతో తీసుకు వెళ్లారు.

Also Read : Shaktimaan : శక్తి‌మాన్ లా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి-పోలీసుల హెచ్చరిక