Ice Creame : ప్రపంచంలో ఖరీదైన ఐస్ క్రీమ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల ప్రపంచంలోని ఖరీదైన ఐస్ క్రీమ్ రుచి చూసేందుకు దుబాయ్ వెళ్ళింది.

Ice Creame : ప్రపంచంలో ఖరీదైన ఐస్ క్రీమ్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ice Cream

Ice Creame : ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నారుల నుండి పెద్దల వరకు ఐస్ క్రీమ్ పేరు వినగానే ప్రాణాలు లేచొస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ రకాల ఐస్ క్రీమ్ లను డైరీ సంస్ధలు అందుబాటులో ఉంచుతున్నాయి. నోరూరించే ఐస్ క్రీమ్ లను తినేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. మార్కెట్లో ఐస్ క్రీముల ఖరీదు 100రూపాయల నుండి మొదలు 1000 రూపాయల వరకు ఉంది. అయితే దుబాయ్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నం.. అక్కడ లభించే ఐస్ క్రీమ్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే..

ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల ప్రపంచంలోని ఖరీదైన ఐస్ క్రీమ్ రుచి చూసేందుకు దుబాయ్ వెళ్ళింది. అక్కడ జుమేరా రోడ్డులో ఉన్న ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఖరీదైన ఐస్ క్రీమ్ ను ఆమె ఐస్ క్రీమ్ ప్రియులకు పరిచయం చేశారు. ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ ధర 840 డాలర్లు అదే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 60వేల రూపాయలు. నమ్మకం కలగటంలేదుకదా… అవును నిజమే.. ఆఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ప్రదర్శనగా ఉంచారు వ్లాగర్ షెనాజ్. ఈ వీడియోను చూసిన ఐస్ క్రీమ్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.

దుబాయ్ ఐస్ క్రీమ్ తయారీలో ఖరీదైన వెనీలా బీన్స్ ను వినియోగిస్తున్నారు. వాటితోపాటు తినేందుకు వీలైన బంగారాపు రేకులను ఉపయోగిస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ కు వారు బ్లాక్ డైమండ్ గా పేరు పెట్టారు. పొరలుపొరలు గా ఉండే బంగారు రేకులు ఐస్ క్రీమ్ పై ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దుబాయ్ ఐస్ క్రీమ్ వీడియో వైరల్ గామారింది. ఈ వీడియోను చూసిన వారంతా ఐస్ క్రీమ్ ను చూసి లొట్టలేసుకుంటున్నారు.