No Mask : మూతికి మాస్కులేదని రైలు నుండి దింపేశారు.

స్పెయిన్ లో ఇదే తరహాలో ఓ యువకుడు మాస్కు లేకుండా రైలెక్కటంతో ఆక్కడ ప్రయాణికులు అతనికి తగిన బుద్ది చెప్పారు.

No Mask : మూతికి మాస్కులేదని రైలు నుండి దింపేశారు.

మాస్కులేకుండా రైలెక్కాడు..అంతాకలసి దింపేశారు.

No Mask : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిత్యం భయగుప్పెట్లో బ్రతుకుతున్నారు. పరిస్ధితి దారుణంగా ఉన్న కరోనా పట్ల జాగ్రత్తలు పాటించకపోను అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాస్కులు ధరించకుండా చాలా మంది జనసమూహాల్లో సంచరించటం కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నవారిని సైతం ఆందోళన గురయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా యువత కనీసం మాస్కులు ధరించకుండా తిరుగుతూ ఇతరులకు ఇబ్బందికరంగా మారారు.

స్పెయిన్ లో ఇదే తరహాలో ఓ యువకుడు మాస్కు లేకుండా రైలెక్కటంతో ఆక్కడ ప్రయాణికులు అతనికి తగిన బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… యూరప్ దేశం స్పెయిన్ లో లోకల్ ట్రైన్ లో ప్రయాణించేందుకు ఓ యువకుడు మాస్కు ధరించకుండా రైలు ఎక్కేశాడు. ఇది గమనించిన పక్కనే ఉన్న మహిళ ఆయువకుడిని మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగింది. తక్షణం మాస్కు పెట్టుకోవాలని కోరింది. ఆయితే ఆయువకుడు మాత్రం ఆమహిళ మాటలు వినకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ ఆయువకుడిని మెడపట్టుకుని ట్రైన్ డోర్ వద్దకు తోసుకువెళ్ళింది. ఇది చూసిన సహ ప్రయాణికులు సైతం ఆమె చర్యలకు మద్దతుగా నిలిచారు. అంతా కలసి ఓ చెయ్యేసి మాస్కులేకుండా ట్రైన్ ఎక్కిన యువకుడిని క్రిందికి దింపేశారు. చేసేది లేక ఆ యువకుడు ట్రైను దిగి వెళ్ళిపోయాడు. అప్పటికి రైలు ఇంకా కదల్లేదు. ఈ ఘటనతో యువతలో చాలా మంది కరోనా పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మాస్కు ధరించకపోవటం తమకు ఫ్యాషన్ కావచ్చు. కాని అది ఇతరులకు ఇబ్బంది కాకూడదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళ చేసిన పనిని హర్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.