Presidential Election Result 2022: ముగిసిన రెండో రౌండ్.. భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్ ముగిసే సరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Presidential Election Result 2022: ముగిసిన రెండో రౌండ్.. భారీ ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..

President Election

Presidential Election Result 2022: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. రెండో రౌండ్ ముగిసే సరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు 1349( విలువ – 283299), విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు (విలువ – 179876) వచ్చాయి.

Presidential Election: నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాలు

పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలి రౌండ్లలో ఎంపీలు ఓట్ల లెక్కింపును పూర్తి చేశారు. మొత్తం 784 మంది పార్లమెంట్ సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 540 ఓట్లను (విలువ – 3,78,000) ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు( విలువ -1,45,600) వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది.

Presidential Election Result 2022

ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.