Dates: ఖర్జూరం తింటే బరువు తగ్గవచ్చా? డయాబెటిస్ ఉంటే తినొచ్చా?

యాంత్రిక జీవనంలో మూడు పూటల సరిగ్గా ఆహారం తీసుకోవడం కూడా సమస్యే. మూడు పూటలా సరైన తీరులో ఆహారం తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి.

Dates: ఖర్జూరం తింటే బరువు తగ్గవచ్చా? డయాబెటిస్ ఉంటే తినొచ్చా?

Dates

Dates: యాంత్రిక జీవనంలో మూడు పూటల సరిగ్గా ఆహారం తీసుకోవడం కూడా సమస్యే. మూడు పూటలా సరైన తీరులో ఆహారం తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. ఆహారంలో కూడా ఏది తీసుకుంటే మంచిదీ? ఏంది తీసుకుంటే మంచిది కాదు? అనేది ఎప్పుడూ అనుమానమే. కొంతమంది ఖర్జూరం విషయంలో కూడా అటువంటి అనుమానాలతో ఉంటారు.

ఖర్జూరం తింటే, అందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి శరీరానికి మంచిదే. కానీ ఖర్జూరాలను అధికంగా తీసుకోవడం మాత్రం కొందరికి మంచిది కాదు.

ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఖర్జూరం తీసుకోవడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటుంది, అధిక కేలరీల స్థాయిలు ఉంటాయి. అటువంటివారు ఎక్కువ ఖర్జూరాలు తీసుకుంటే, అవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. అప్పుడు వారికి ఖర్జూరం హానికరం కావచ్చు.

ఖర్జూరాలు తినడం వల్ల సహజంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ వంటి చక్కెరలు ఎక్కువ అవుతాయి. వారి గ్లైసెమిక్ సూచిక 103ని దాటిపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది సాధారణ గ్లూకోజ్ స్థాయిల కంటే ఎక్కువ. అందువల్ల మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు మరియు ప్రీ-డయాబెటిస్ సమస్య ఉన్నవారు మోతాదును మించి ఖర్జూరం తీసుకోకపోవడమే మంచిది.

ఇక ఖర్జూరాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దంత క్షయం మరియు కావిటీస్‌కు కారణం కావచ్చు. తిన్న తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించి వూస్తే మంచిది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఆకలికాకుండా ఉండటానికి ఖర్జూరం సాయం చేస్తుంది. అతిగా తినడం అనే ఆలోచనను తగ్గిస్తుంది. ఖర్జూరాలు శరీర బరువును తగ్గించడంలో సహాయం చేస్తుందని, అయితే, మితంగా తీసుకుంటే మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.