Tamil Nadu : గవర్నర్ ​అధికారాల్లో కోత

వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్​ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు.

Tamil Nadu : గవర్నర్ ​అధికారాల్లో కోత

Tamilnadu

Tamil Nadu government : కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర గవర్నర్ ​అధికారాల్లో కోత విధించింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్​ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బిల్లుపై మాట్లాడారు.