Telangana CM KCR: రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది.. దేశానికి దిక్సూచిగా మారింది.. జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ .. కేంద్రంపై మండిపాటు

అహింసా మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

Telangana CM KCR: రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది.. దేశానికి దిక్సూచిగా మారింది.. జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ .. కేంద్రంపై మండిపాటు

CM KCR

Telangana CM KCR: అహింసా మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండ కోట‌పై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగుర‌వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25కోట్ల జెండాలను ప్రతీ ఇంటికి చేర్చామని, రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని అన్న కేసీఆర్.. వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారిందని, అన్ని రంగాల్లో 24గంటల విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. సాగులో 11.6శాతం వృద్ధిరేటు సాధించామని కేసీఆర్ అన్నారు. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్ వన్ గా నిలిచామని, గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. 11.1 శాతం వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నామని, దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.

Independence Day Celebrations : సినీ సెలబ్రిటీల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు & శుభాకాంక్షలు

75ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించిందని అన్నారు. కానీ ఆ తరువాత వారి అభివృద్ధికోసం పెద్దగా ప్రయత్నం జరగలేదని అన్నారు. అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపారు. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళిత బంధు అని, దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నదని అన్నారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

తన ప్రసంగంలో సీఎం కేసీఆర్  కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్దంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలని, కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుందని ఆరోపించారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతుందని కేసీఆర్ అన్నారు. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నింటిమీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్య తరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.